రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ సాహసోపేత నిర్ణయాలు

ABN , First Publish Date - 2022-05-27T05:22:27+05:30 IST

రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ సాహసోపేత నిర్ణయాలు

రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ సాహసోపేత నిర్ణయాలు
ఎమ్మెల్సీ నారాయణరెడ్డిని సన్మానిస్తున్న గాజుల శ్రీనివాస్‌, నాయకులు

ఆమనగల్లు, మే 26: రాష్ట్రాభివృద్ధి, ప్రజా సం క్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. పల్లెలను అభివృద్ధి చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఆమనగల్లు, కడ్తాల్‌, తలకొండపల్లి, మండలాల పరిధిలో గురువారం ఎమ్మెల్సీ విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరైన పలువురికి ఆయన చెక్కులను పంపిణీ చేశారు. ఇటీవలె ఆమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన నారాయణరెడ్డిని ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందన్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావివ్వకుండా ప్రజలంతా పాలు పంచుకోవాలని నారాయణరెడ్డి కోరారు. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. కార్యక్రమంలో చేనేత సంఘం అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్‌, అవ్వారి శివలింగం, నరేందర్‌, శేఖర్‌, పురుషోత్తం, మామిడిశెట్టి గోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T05:22:27+05:30 IST