చేతులు నాజూకుగా తయారవ్వాలంటే...

ABN , First Publish Date - 2022-04-14T17:24:27+05:30 IST

చేతులు నాజూకుగా తయారవ్వాలంటే మోచేతుల దిగువన, పైన పేరుకునే కొవ్వును కరిగించే

చేతులు నాజూకుగా తయారవ్వాలంటే...

ఆంధ్రజ్యోతి(14-04-2022)

చేతులు నాజూకుగా తయారవ్వాలంటే మోచేతుల దిగువన, పైన పేరుకునే కొవ్వును కరిగించే వ్యాయామాలు చేయాలి. ఈ వ్యాయామాలతో కొవ్వు కరగడంతో పాటు చేతులు, భుజాల్లోని కండరాలు కూడా బలపడతాయి. 


ఆర్మ్‌ సర్కిల్స్‌

నిటారుగా నిలబడి చేతులు రెండు వైపులా సమాంతరంగా చాపాలి. రెండు చేతులను సవ్య, అపసవ్య దిశల్లో వృత్తాకారంలో కదిలించాలి.ఇలా కదిలించేటప్పుడు రెండు చేతులూ ఒకేసారి కదలాలి.ఇలా రెండు వైపులా 15 సార్లు తిప్పి ఆపాలి.రెండు చేతులను కిందకు దింపి, స్ట్రెచ్‌ చేయాలి.


డంబెల్‌ పుష్‌ అప్స్‌

ఐదు కిలోల డంబెల్స్‌ రెండు తీసుకోవాలి.నేల మీద బోర్లా పడుకుని, రెండు డంబెల్స్‌ను పట్టుకుని ప్లాంక్‌ భంగిమ వేయాలి.చేతులతో పట్టుకున్న డంబెల్స్‌, కాలి మునివేళ్ల మీద శరీర భారం మోపాలి.తర్వాత ఒక చేతితో డంబెల్‌ను నిటారుగా పైకి లేపాలి. ఇలా లేపేటప్పుడు శరీరం, తల కూడా పైకి తిప్పాలి.డంబెల్‌ను తిరిగి నేల మీద ఉంచి, రెండో చేతిని డంబెల్‌తో సహా పైకి లేపాలి. డంబెల్‌ దిశగా శరీరం, తల కూడా తిప్పాలి. ఇలా చెరొక చేత్తో 15 సార్లు మూడు సెట్లు చేయాలి.


హిందూ పుష్‌ అప్స్‌

రెండు అర చేతులు, పాదాలు నేలకు ఆనించి త్రికోణాకారంలో శరీరాన్ని ఉంచాలి.చాపిన రెండు చేతుల మీద శరీర బరువు మోపి, శరీరాన్ని ముందుకు కదలిస్తూ నడుమును నేల మీదకు దింపాలి.అదే వేగంతో శరీరాన్ని తిరిగి పైకి  లేపాలి. ఇలా ఆపకుండా 15 పుష్‌ అప్స్‌ చేయాలి.

Updated Date - 2022-04-14T17:24:27+05:30 IST