స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల కోసం యూట్యూబ్‌ కొత్త హంగులు

ABN , First Publish Date - 2021-06-05T05:21:49+05:30 IST

స్మార్ట్‌ఫోన్‌లో చూసే వీక్షకుల కోసం రెండు కొత్త ఫీచర్లను యూట్యూబ్‌ పరిచయం చేస్తోంది.

స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల కోసం  యూట్యూబ్‌ కొత్త హంగులు

స్మార్ట్‌ఫోన్‌లో చూసే వీక్షకుల కోసం రెండు కొత్త ఫీచర్లను యూట్యూబ్‌ పరిచయం చేస్తోంది. వీడియో వాచింగ్‌లో కంట్రోల్స్‌గా ఈ కొత్త ఫీచర్లు ఉపయోగపడతాయి. లూప్‌లో వీడియోను ప్లే చేయడం ఇందులో ఒకటి. డెస్క్‌టాప్‌ యూజర్లకు ఇంతకు ముందే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లోనూ ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ వినియోగదారులు త్రీడాట్‌ బటన్‌పై టాపింగ్‌ చేయడం ద్వారా దీన్ని వాడుకోవచ్చు. 


వీడియోనుంచి కొంత భాగాన్ని క్లిప్‌ చేయడం రెండో ఫీచర్‌. యూట్యూబ్‌లో ఉన్న ఒక వీడియో నుంచి అరవై సెకెన్లు అంటే ఒక నిమిషం నిడివి గల వీడియోను క్లిప్‌ చేయవచ్చు. దాన్ని ఇతరులకు షేర్‌ కూడా చేసుకోవచ్చు. సిజర్స్‌ ఐకాన్‌ కనిపించిన వెంటనే ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉన్న ఫీచర్లు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని ‘డ్రాయిడ్‌మేజ్‌’ వెల్లడించింది.


స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల కోసం యూట్యూబ్‌ ఇప్పటికే నాలుగు ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. ‘ఆటో’ డిఫాల్ట్‌ ఆప్షన్‌. బ్యాండ్‌ విడ్త్‌ వేగానికి సమానంగా క్వాలిటీ దీంతో లభ్యమవుతుంది. ఇక ‘హై పిక్చర్‌ క్వాలిటీ’. పేరుకు తగ్గట్టు మంచి రిజల్యూషన్‌ కోసం ఉపయోగపడుతుంది. తక్కువ డేటా, రిజల్యూషన్‌ ఉపయోగించే పాత దానికి సరిగ్గా విరుద్ధంగా పనిచేస్తుంది ‘డేటా సేవర్‌’. వీడియోను ఏ రిజల్యూషన్‌లో స్ట్రీమ్‌ చేయాలని అనుకుంటున్నారో అందుకు తగ్గట్టుగా ఉపయోగపడేది ‘అడ్వాన్స్‌డ్‌’.

Updated Date - 2021-06-05T05:21:49+05:30 IST