జిల్లాలోని ఎస్సీలకు రూ. 1.31 కోట్ల రుణాలు ఎమ్మెల్యే రేఖానాయక్‌

ABN , First Publish Date - 2021-09-18T06:00:27+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలోని దళితుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అందులో భాగంగానే ఆదిలాబాద్‌ జిల్లాలోని 263 మంది ఎస్సీ నిరుపేదలకు రూ. 1.31 లక్షల రుణాలను మంజూరు చేయడం జరిగిందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు.

జిల్లాలోని ఎస్సీలకు రూ. 1.31 కోట్ల రుణాలు ఎమ్మెల్యే రేఖానాయక్‌
సిరికొండలో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్యెల్యే

ఉట్నూర్‌, సెప్టెంబరు 17 : తెలంగాణ రాష్ట్రంలోని దళితుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అందులో భాగంగానే ఆదిలాబాద్‌ జిల్లాలోని 263 మంది ఎస్సీ నిరుపేదలకు రూ. 1.31 లక్షల రుణాలను మంజూరు చేయడం జరిగిందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ఆస్తు ల పంపిణీ కార్యక్రమానికి హాజరై ఎస్సీ లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఉట్నూర్‌, ఇంద్రవెల్లి మండలంలో 39 మందికి రూ. 41 లక్షలు చిరువ్యాపారం కోసం బ్యాంకుతో సం బంధం లేకుండా రుణాలు మంజూరు అయ్యిందన్నారు. అదే విధంగా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కార్యక్రమం ద్వారా 53 మందికి రూ. 58 లక్షల చెక్కులను పంపిణీ చేస్తున్నామన్నా రు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మూడోసారి కూడ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చే శారు. ప్రజలసంక్షేమం కోసం అహర్నిషలు కృషి చే స్తున్న  ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించుకుంటారని అన్నారు. కాంగ్రెస్‌  పార్టీ నాయకత్వం పగటి కల లు కంటూ ప్రభుత్వంపై అనాలోచిత విమర్శలు చేస్తుందని ఆరోపించారు. ఇంద్రవెల్లిలో రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత గిరిజన దండోర తో ఒరిగింది ఏమీ లేదని అన్నారు. ప్రజలే ప్రతిపక్షాలకు తగిన గుణపాఠం చెపుతాయని, ఎన్నికల సమయంలో  ప్రజలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, వైస్‌ ఎంపీపీ దావులే బాలాజీ,  సింగిల్‌విండో చైర్మన్‌ సామ ప్రభాకర్‌. రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు అజీమోద్దిన్‌, మం డల  పార్టీ అధ్యక్షుడు కందుకూరి రమేష్‌,  మాజీ జడ్పిటీసీ వాగ్మారే జగ్జీవన్‌, శారద, జాదవ్‌ శ్రీరాం, జూవ్వాద్‌ అన్సారీ, లతీఫ్‌, రాజ్‌కుమార్‌, కాలేరి రవి, తహసీల్దార్‌ సతీష్‌కుమార్‌, బెరిగెడి మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. 

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

సిరికొండ, సెప్టెంబర్‌ 17 : సిరికొండ మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన ముగ్గురు లబ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను  శుక్రవారం ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ పం పిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ యజ్వేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-18T06:00:27+05:30 IST