Abn logo
Sep 18 2021 @ 14:50PM

రాజకీయాలకు.. అయ్యన్న తగడు: హోంమంత్రి

అమరావతి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు.. రాజకీయాలకు తగడని హోంమంత్రి సుచరిత అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి సీఎం జగన్‌ను.. గొప్ప స్థానంలో కూర్చోబెట్టారని చెప్పారు. ప్రజల తీర్పును అయ్యన్న.. గౌరవించకుండా ఘోరమైన భాష మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తిపై ప్రయోగించే భాష ఇదేనా.. అంటూ.. ప్రశ్నించారు.


తనను మహిళ అని చూడకుండా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. గొప్పదనం అనేది ప్రవర్తను బట్టి ఉంటుందన్నారు. తాను దళిత జాతిలో పుట్టినందుకు గర్వపడుతున్నానని తెలిపారు. వ్యక్తిగతంగా తనను కించపరిచే హక్కు అయ్యన్నకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని హోంమంత్రి హితవుపలికారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...