గులాబీ రంగు పెదాల కోసం...

ABN , First Publish Date - 2020-12-14T07:03:37+05:30 IST

పెదాలు లేత గులాబీ రంగులో ఉంటే ఆ లుక్కే వేరు. ఇందుకోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ చిన్నచిన్న చిట్కాలతో పెదాలను లేత గులాబీ రంగులో మెరిసిపోయేలా చేసుకోవచ్చు. ఆ చిట్కాలు ఇవి...

గులాబీ రంగు పెదాల కోసం...

పెదాలు లేత గులాబీ రంగులో ఉంటే ఆ లుక్కే వేరు. ఇందుకోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ చిన్నచిన్న చిట్కాలతో పెదాలను లేత గులాబీ రంగులో మెరిసిపోయేలా చేసుకోవచ్చు. ఆ చిట్కాలు ఇవి... 


 వారానికొకసారి న్యాచురల్‌ లిప్‌ స్క్రబ్బర్‌ను ఉపయోగించండి. దీనివల్ల చర్మంపైన ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. ఫలితంగా పెదాలు సాధారణ రంగులోకి వచ్చేస్తాయి. కొన్ని చుక్కల ఆలివ్‌ ఆయిల్‌లో ఒక టీస్పూన్‌ షుగర్‌ కలిపి పెదాలపై రాసుకుంటే సరిపోతుంది. 


 రాత్రి పడుకునే ముందు పెదాలపై నిమ్మరసం రాసుకోవాలి. ఇలా కొన్నినెలల పాటు చేస్తే డార్క్‌లిప్స్‌ సాధారణ రంగులోకి వచ్చేస్తాయి. నిమ్మకాయను కట్‌ చేసి ఒక ముక్కపై కొంచెం పంచదార వేసి నెమ్మదిగా పెదాలపై రబ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా మృతకణాలు తొలగిపోయి పెదాలు మంచి రంగును సంతరించుకుంటాయి. 


 బీట్‌రూట్‌లో న్యాచురల్‌ బ్లీచింగ్‌ గుణాలుంటాయి. డార్క్‌లిప్స్‌ను లేతరంగులోకి మారేలా చేయడంలో బీట్‌రూట్‌ బాగా ఉపయోగపడుతుంది. రాత్రిపడుకునే ముందు పెదాలపై బీట్‌రూట్‌ జ్యూస్‌ రాసుకుని ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజూ ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.


 బీట్‌రూట్‌ జ్యూస్‌, క్యారెట్‌ జ్యూస్‌ కలిపి పెదాలపై నెమ్మదిగా మర్దన చేయాలి. తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. వారంలో రెండు రోజులు ఇలా చేయడం వల్ల పెదాలు లేత గులాబీరంగులోకి మారతాయి.

Updated Date - 2020-12-14T07:03:37+05:30 IST