గులాబీ రంగు పెదాల కోసం...

ABN , First Publish Date - 2021-07-19T05:30:00+05:30 IST

పెదాలు ముదురు రంగులోకి మారడానికి కారణం మృతకణాలు. ఆ కణాలను తొలగిస్తే పెదవులు మృదువుగా, లేత గులాబీ రంగులోకి మారతాయి.

గులాబీ రంగు పెదాల కోసం...

పెదాలు ముదురు రంగులోకి మారడానికి కారణం మృతకణాలు. ఆ కణాలను తొలగిస్తే పెదవులు మృదువుగా, లేత గులాబీ రంగులోకి మారతాయి. ఇందుకోసం ఏం చేయాలంటే....

ఒక టేబుల్‌స్పూన్‌ పంచదార, ఒక టేబుల్‌స్పూన్‌ తేనె తీసుకుని పెదాలపై నెమ్మదిగా రెండు నిమిషాల పాటు మర్దన చేయాలి. తేనెలో ఉండే ఎంజైములు పెదవులను లేతరంగులోకి మారుస్తాయి. వారంలో మూడు సార్లు ఇలా చేయాలి..

అరకప్పు పాలల్లో కొన్ని గులాబీరేకులను వేసి రాత్రంతా ఉంచాలి. ఉదయాన్నే ఆ గులాబీరేకులను పేస్టుగా చేసి పెదాలపై రాసుకోవాలి. పావుగంట తరువాత కడిగేసుకోవాలి. గులాబీ రంగు పెదాల కోసం ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది.

బీట్‌రూట్‌లో ఉండే న్యాచురల్‌ రెడ్‌ పిగ్మెంట్స్‌ మీ పెదాలను గులాబీ రంగులోకి మారుస్తాయి. బీట్‌రూట్‌ను కట్‌ చేసి నేరుగా పెదాలపై స్క్రబ్‌ చేసుకోవచ్చు. లేదా బీట్‌రూట్‌ను జ్యూస్‌గా చేసి కొద్దిగా తేనె కలిపి పెదాలపై రాయాలి. రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకోవచ్చు. బీట్‌రూట్‌  జ్యూస్‌ పెదాలపై ఉండే మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది.

బెర్రీలలో ఉండే విటమిన్లు, మినరల్స్‌ పెదాలు ముదురు రంగులోకి మారడాన్ని నిరోధిస్తాయి. స్ట్రాబెర్రీలను మెత్తగా చేసి ఒక టీస్పూన్‌ తేనె కలిపి పెదాలపై రాసుకోవాలి. వారంలో మూడు నాలుగు సార్లు ఇలా చేస్తే పెదాలు లేత గులాబీరంగులోకి మారతాయి.

ఆల్మండ్‌ ఆయిల్‌ పెదాలకు మంచి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. ఒక టేబుల్‌స్పూన్‌ ఆల్మండ్‌ ఆయిల్‌లో కొద్దిగా నిమ్మరసం వేసి పెదాలపై ఆప్లై చేయాలి. 

Updated Date - 2021-07-19T05:30:00+05:30 IST