పాండాల కోసం..!

ABN , First Publish Date - 2021-07-06T05:52:45+05:30 IST

వృద్ధాప్యంలో సకల సదుపాయాలు చెంతనే ఉండాలని కోరుకుంటారు. మరి జంతువుల మాటేమిటి? వాటిని ఎవరు పట్టించుకుంటారు? అంటే ఇదిగో మేం ఉన్నాం అంటున్నారు డుజింగ్యాన్‌ వైద్యులు.

పాండాల కోసం..!

వృద్ధాప్యంలో సకల సదుపాయాలు చెంతనే ఉండాలని కోరుకుంటారు. మరి జంతువుల మాటేమిటి? వాటిని  ఎవరు పట్టించుకుంటారు? అంటే ఇదిగో మేం ఉన్నాం అంటున్నారు డుజింగ్యాన్‌ వైద్యులు. పాండాల సంరక్షణ కోసం ఒక సెంటర్‌ను ఏర్పాటు చేసి వాటి బాగోగులు చూస్తున్నారు. వృద్ధాప్యంలో అవి అక్కడ సేదతీరేందుకు అవసరమైన అన్ని వసతులు సమకూర్చారు.

 

చైనాలోని డుజింగ్యాన్‌ అనే ప్రాంతంలో పాండాల కోసం చైనా కన్వర్జేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ ద గెయింట్‌ పాండా పేరుతో ఆసుపత్రిని నెలకొల్పారు. ప్రపంచంలో ఉన్న పాండాల సంఖ్యలో 30 శాతం పాండాలు ఈ ఆసుపత్రి ఉన్న సిచువాన్‌ ప్రావిన్స్‌లోనే ఉన్నాయి. వాటి రక్షణ కోసమే ఈ ఆసుపత్రి ఏర్పాటు చేశారు.



ఇక్కడ పాండాలకు ఇష్టమైన ఆహారాన్ని అందిస్తారు. క్యారెట్స్‌, ఆపిల్స్‌, పాలు లాంటివి ఇస్తారు. పాండాలు ఇష్టపడే వెదురు చెట్లు ఆసుపత్రి ప్రాంగణంలో ఎటు చూసినా కనిపిస్తాయి.


సాధారణంగా పాండాల జీవితకాలం 20 ఏళ్లు ఉంటుంది. ప్రత్యేక పరిస్థితుల్లో ఉంచి సంరక్షిస్తే 30 ఏళ్లు జీవిస్తాయి. 

Updated Date - 2021-07-06T05:52:45+05:30 IST