నొప్పి నుంచి ఉపశమనానికి...

ABN , First Publish Date - 2021-07-07T06:16:08+05:30 IST

పాదాలు, మడమ నొప్పి కొందరిని తీవ్రంగా వేధిస్తాయి. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటించడం ద్వారా నొప్పి నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

నొప్పి నుంచి ఉపశమనానికి...

పాదాలు, మడమ నొప్పి కొందరిని తీవ్రంగా వేధిస్తాయి. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటించడం ద్వారా నొప్పి నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.


నీళ్లలో కొద్దిగా ఎప్సమ్‌ సాల్ట్‌ వేసి పాదాలు అందులో పెట్టాలి. నెమ్మదిగా మడమల దగ్గర మసాజ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో ఉన్న మెగ్నీషియం ఎముకల్లో నిలువ అవుతుంది. మెగ్నీషియం సల్ఫేట్‌నే ఎప్సమ్‌ సాల్ట్‌ అంటారు. 


రోజ్‌మేరీ, లావెండర్‌, ఆలివ్‌ ఆయిల్‌ వంటి నూనెలతో మసాజ్‌ చేసుకోవడం వల్ల నొప్పి దూరమవుతుంది.


యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ ఎముకల్లో ఉన్న  అదనపు కాల్షియంను తొలగించి ఉపశమనాన్ని అందిస్తుంది. గోరువెచ్చని నీళ్లలోకి కొన్ని చుక్కలు యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ వేసి పాదాలు పెట్టాలి. 


నొప్పి ఉన్న చోట ఐస్‌ప్యాక్‌ పెడితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. 


నీళ్లలో ఒక టీస్పూన్‌ బేకింగ్‌ సోడా వేసి పేస్టులా చేసి నొప్పి ఉన్న చోట రాస్తే తొందరగా తగ్గుతుంది.

Updated Date - 2021-07-07T06:16:08+05:30 IST