తల్లీబిడ్డ ఆరోగ్యం కోసం!

ABN , First Publish Date - 2021-03-28T05:42:30+05:30 IST

వ్యాయామాలతో శరీరం దృఢంగా మారడమే కాదు ఆరోగ్యం సొంతమవుతుంది. అందుకే మహిళలకు గర్భం దాల్చిన తరువాత కూడా వ్యాయామాలు చేయాలని సూచిస్తుంటారు వైద్యులు. అయితే గర్భిణులకు కష్టతరమైన వ్యాయామాలు చేయడం సాధ్యం

తల్లీబిడ్డ ఆరోగ్యం కోసం!

వ్యాయామాలతో శరీరం దృఢంగా మారడమే కాదు ఆరోగ్యం సొంతమవుతుంది. అందుకే మహిళలకు గర్భం దాల్చిన తరువాత కూడా వ్యాయామాలు చేయాలని సూచిస్తుంటారు వైద్యులు. అయితే గర్భిణులకు కష్టతరమైన వ్యాయామాలు చేయడం సాధ్యం కాదు. అందుకే తేలికైన వ్యాయామాలు చేయాలి. అలా చేయడం వల్ల పుట్టబోయే బిడ్డకు ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవని, ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్సర్‌సైజ్‌ చేయడం పిల్లల్లో మధుమేహం, ఇతర జీవక్రియాసంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని చెబుతోంది తాజా అధ్యయనం. ‘‘ఇప్పుడు మనం పిల్లల్లో చూస్తున్న వ్యాధుల్లో చాలా వరకు పిండస్థ దశ నుంచి పుట్టుకొచ్చేవే. తల్లిదండ్రుల ఆరోగ్యం సరిగా లేకపోతే పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పిల్లల జన్యువులలో రసాయన మార్పులకు కారణమవుతుంది’’ అంటున్నారు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియా స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన జెన్‌యాన్‌ అనే పరిశోధకుడు.

Updated Date - 2021-03-28T05:42:30+05:30 IST