ప్రేమికుడి కోసం సముద్రంలో ఈదుతూ

ABN , First Publish Date - 2022-06-02T08:39:05+05:30 IST

కోల్‌కతా, జూన్‌ 1: ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడాలనే ఆలోచనతో ఆ బంగ్లాదేశ్‌ యువతి వెనుకా ముందూ ఆలోచించలేదు. ప్రాణాలను లెక్క చేయకుండా పులులు ఉండే దట్టమైన అడవిలోకి

ప్రేమికుడి కోసం సముద్రంలో ఈదుతూ

-భారత్‌కు బంగ్లాదేశ్‌ యువతి సాహసం

-కోల్‌కతా ఆలయంలో పెళ్లి

కోల్‌కతా, జూన్‌ 1: ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడాలనే ఆలోచనతో ఆ బంగ్లాదేశ్‌ యువతి వెనుకా ముందూ ఆలోచించలేదు. ప్రాణాలను లెక్క చేయకుండా పులులు ఉండే దట్టమైన అడవిలోకి ప్రవేశించి.. సముద్రంలోకి దూకి గంటపాటు ఈదుకుంటూ భారత భూభాగంలోకి అడుగుపెట్టింది. బంగ్లాదేశ్‌కు చెందిన కృష్ణ మండల్‌ అనే యువతి సాహసమిది! ఫేస్‌బుక్‌లో ఆమెకు కోల్‌కతా వాస్తవ్యుడు అభిక్‌ మండల్‌ అనే యువకుడితో పరిచయం ప్రేమగా మారింది. అతడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా భారత్‌కు వచ్చేందుకు ఆమెకు పాస్‌పోర్టు లేదు. దీంతో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాలనుకొని రాయల్‌ బెంగాల్‌ టైగర్లు ఉండే సుందర్‌బన్‌ అడవిలోకి ప్రవేశింది. ఆ అడవిని దాటుకొని.. సముద్రంలోకి దూకి ఈదుకుంటూ పశ్చిమబెంగాల్‌కు చేరుకుంది. మూడు రోజుల క్రితం కోల్‌కతాలోని కాళీ ఆలయంలో కృష్ణ మండల్‌-అభిక్‌ మండల్‌ వివాహం జరిగింది. అయితే భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినందుకు కృష్ణ మండల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను బంగ్లాదేశ్‌ రాయబార కార్యాలయ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిసింది. 

Updated Date - 2022-06-02T08:39:05+05:30 IST