గాయనీమణుల్లో... మాల్గాడి శుభది ప్రత్యేకమైన స్థానం. పాట పాడడంలో ఆమెది వినూత్నమైన ఒరవడి. చాలాకాలం తరవాత మాల్గాడి శుభ ఓ పాట పాడారు. ‘ఇంటి నం.13’ కోసం. రీగల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన చిత్రమిది. పన్నా రాయల్ దర్శకుడు. హసన్ పాషా నిర్మాత. ఈ చిత్రంలోని ‘నర నరము’ అనే పాటని మాల్గాడి శుభ ఆలపించారు. రాంబాబు గోశాల రచించిన ఈ గీతానికి వినోద్ యాజమాన్య స్వరాలు సమకూర్చారు. ‘‘ఇప్పటి వరకూ విడుదల చేసిన పాటలకు, ప్రచార చిత్రాలకూ మంచి స్పందన వచ్చింది. ‘పో పోవె’ అనే గీతాన్ని శ్రేయాఘోషల్ ఆలపించారు. ఆ పాట ఇప్పటికే ఆదరణ పొందుతోంది. మాల్గాడి శుభ పాడిన ఈ పాట యువతరానికి నచ్చేస్తుంద’’న్నారు నిర్మాత.