అధిక రక్తపోటు ఉంటే?

ABN , First Publish Date - 2021-02-23T20:14:09+05:30 IST

హైపర్‌టెన్షన్‌ అదుపులో ఉండాలంటే, రోజు మొత్తంలో తీసుకునే ఆహారం ద్వారా 1500 మిల్లీగ్రాములకు మించి ఉప్పు శరీరానికి అందకుండా చూసుకోవాలి. అయితే ఎక్కువ శాతం మంది శరీరంలోకి చేరిన అదనపు ఉప్పును మూత్రం, చెమటల ద్వారా విసర్జిస్తూ ఉంటారు. ఇలాంటివారికి

అధిక రక్తపోటు ఉంటే?

ఆంధ్రజ్యోతి(23-02-2021)

అధిక రక్తపోటు ఉంటే ఉప్పు తగ్గించాలని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే ఉప్పు ఎంత తగ్గించాలి? అధిక రక్తపోటును ఆహార మార్పులతో ఎంతమేరకు తగ్గించుకోవచ్చు?


హైపర్‌టెన్షన్‌ అదుపులో ఉండాలంటే, రోజు మొత్తంలో తీసుకునే ఆహారం ద్వారా 1500 మిల్లీగ్రాములకు మించి ఉప్పు శరీరానికి అందకుండా చూసుకోవాలి. అయితే ఎక్కువ శాతం మంది శరీరంలోకి చేరిన అదనపు ఉప్పును మూత్రం, చెమటల ద్వారా విసర్జిస్తూ ఉంటారు. ఇలాంటివారికి ఆహారంలో ఉప్పు తగ్గించడం వల్ల అదనపు ప్రయోజనం అంతగా దక్కదు. అయితే కొందరి పరిస్థితి ఇందుకు విరుద్ధం. శరీరంలో ఉప్పు, పొటాషియం నిష్పత్తుల్లో తారతమ్యాలు కలిగినవారు, మూత్రపిండాల వ్యాధులు కలిగినవారు, పుట్టుకతోనే గుండెజబ్బులు వెంట తెచ్చుకున్నవారు హైపర్‌టెన్షన్‌కు గురైతే తప్పనిసరిగా ఆహారంలో ఉప్పు పరిమాణం తగ్గించాలి. రక్తపోటు సమంగా ఉండాలంటే ఉప్పు, పొటాషియం స్థాయిల మధ్య సమతూకం పాటించాలి.

Updated Date - 2021-02-23T20:14:09+05:30 IST