ఎండాకాలంలో పెదాలు ఆరోగ్యంగా ఉండాలంటే..

ABN , First Publish Date - 2022-04-20T17:50:39+05:30 IST

ఎండాకాలంలో పెదాలు పొడిబారటం, పగలటం జరుగుతుంటుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఏం చేయాలి? పెదాలకు ఎలాంటి సంరక్షణ తీసుకోవాలో తెలుసుకుందాం...

ఎండాకాలంలో పెదాలు ఆరోగ్యంగా ఉండాలంటే..

ఆంధ్రజ్యోతి(20-04-2022)

ఎండాకాలంలో పెదాలు పొడిబారటం, పగలటం జరుగుతుంటుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఏం చేయాలి? పెదాలకు ఎలాంటి సంరక్షణ తీసుకోవాలో తెలుసుకుందాం...


పెదాలు పగలటానికి ముఖ్యమైన కారణం వాతావరణం. ఎండాకాలంలో పెదాలపై తేమ ఆరిపోయి పొడిబారుతాయి. మరీ మితిమీరి పెదాలపై నాలుక తిప్పడం వల్ల పగుళ్లు ఏర్పడతాయి. కొన్ని రకాల మందులు వాడినపుడు పెదాలు పొడిబారుతుంటాయి. పెదాలు పగలటం, పొడిబారి మంట పుట్టిస్తుంటే చర్మవైద్యుడిని కలవాలి.


డీహైడ్రేషన్‌ కలిగినపుడు పెదాలు పొడిబారతాయి. తలనొప్పి, మలబద్ధకం, యూరిన్‌ రావటం తగ్గినపుడు, జ్వరం, నోటిలో తడి ఆరిపోవటం జరిగినపుడు కూడా పెదాలు పగులుతాయి. వాస్తవానికి పెదాలను తడిగా ఉంచాలంటే శరీరంలో ఎలాంటి గ్రంథులు విడుదలకావు. 


ముఖ్యంగా వేసవికాలంలో దుమ్ము, వేడి వల్ల పెదాలు పగులుతాయి. సన్‌స్ర్కీన్‌ లోషన్స్‌ పట్టించుకుంటే వీటినుంచి ఉపశమనం పొందవచ్చు. పేస్ట్‌, టొమాటో సాస్‌, జంక్‌ఫుడ్‌.. లాంటివి పడకపోతే పెదాలు పగిలి మంట పుడతాయి. ఈ సమస్య నుంచి రక్షించుకోవాలంటే మంచినీళ్లు, కొబ్బరినీళ్లు, పండ్లరసాలు తీసుకుంటే ఉత్తమం.


పెదాలపై వెన్న లేదా లిప్‌బామ్‌, కొబ్బరినూనె రాస్తే చక్కని ఫలితం ఉంటుంది. దీనివల్ల పెదాలపై తేమ ఆరిపోదు. పెదాలు బాగా పగిలితే లిప్‌ మాయిశ్చరైజర్‌, లిప్‌బామ్‌ను రోజుకు ఐదారుసార్లు అప్లై చేయండి.


విటమిన్‌-సి, ఇ ఉండే తాజా ఆకుకూరల్ని, పండ్లను తినాలి. మజ్జిగ, లస్సీలు తాగుతుండాలి. వేసవికాలంలో పోషకాలుండే ఆహారం, ద్రవపదార్థాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

Updated Date - 2022-04-20T17:50:39+05:30 IST