Advertisement
Advertisement
Abn logo
Advertisement

వీటితో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది..

ఆంధ్రజ్యోతి(08-03-2020)

ప్రశ్న: చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?


- పద్మప్రియ, వరంగల్‌


డాక్టర్ జవాబు: చర్మం, జుట్టు ఆరోగ్యానికి ప్రొటీన్లు ఎంతో అవసరం. చికెన్‌, చేప, గుడ్లు లాంటి మాంసాహారంతో పాటు పాలు, పెరుగు, పప్పు ధాన్యాలు  మంచి చేస్తాయి. వీటిని రోజుకు ఒకసారి తప్పనిసరిగా తీసుకోవాలి.  ఐరన్‌, జింక్‌, సెలీనియం మొదలైన ఖనిజాలు ఉన్న ఆహారం అవసరం. చికెన్‌, మటన్‌, చేప, రొయ్యలు, గుడ్లు మొదలైన మాంసాహారం; కందులు, పెసలు, మినుములు మొదలైన పప్పు ధాన్యాలు; బాదం, పిస్తా, వాల్నట్స్‌, అవిసె గింజల్ని ఆహారంలో భాగం చేసుకోండి. వీటన్నిటి వల్ల చర్మానికి, జుట్టుకు అవసరమైన ఒమేగా 3 ఫాటీ యాసిడ్లు కొంత లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న మామిడి, పుచ్చ, కమలా, బొప్పాయి, కర్బూజా, దానిమ్మ, నేరేడు  పళ్ళు; కాప్సికం, టమోటా, ఆకుకూరలు చర్మం నిగారింపునకు అవసరం. కాఫీలు, టీలకు దూరంగా ఉండాలి. బాగా నీళ్లు తాగాలి. స్వీట్లు, చాక్‌లెట్లు, వేపుడు కూరలు, నూనెలో వేయించే చిరుతిళ్ళు, బేకరీ ఫుడ్స్‌ తగ్గించి పప్పుధాన్యాలు, ముడి ధాన్యాలతో చేసిన ఆహారం తీసుకోవాలి. రోజూ అరగంటపాటైనా వ్యాయామం చేస్తే రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. ఫలితంగా చర్మం కాంతిమంతమవుతుంది. నడక, జాగింగ్‌ లాంటి వ్యాయామాలు; యోగా, మెడిటేషన్‌ వల్ల ఆందోళనలు ఆగి జుట్టు రాలడం తగ్గుతుంది.


డా. లహరి సూరపనేని

 న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను 

[email protected] కు పంపవచ్చు)

Advertisement
Advertisement