ఆరోగ్యమైన కళ్ల కోసం...

ABN , First Publish Date - 2020-08-13T16:05:07+05:30 IST

కంటి చూపు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్ల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన

ఆరోగ్యమైన కళ్ల కోసం...

ఆంధ్రజ్యోతి(13-08-2020)

కంటి చూపు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్ల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన విటమిన్లు వేటిల్లో బాగా ఉంటాయంటే...


ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండేలా చూసుకోవాలి. విటమిన్‌ ఎ ఉండే పదార్థాలు తీసుకోవాలి. గుడ్డులోని పచ్చసొన, క్యారెట్‌, మొక్కజొన్న, ఆకుకూరలు బాగా తీసుకోవాలి.

కంటి రెటీనా ఆరోగ్యంగా ఉండాలంటే హెల్దీ ఫ్యాట్స్‌ అంటే ఒమేగా 3 కొవ్వు పదార్థాలు తీసుకోవాలి. అలాగే రెండు మూడు రకాల వంట నూనెలు వాడడం, వాల్‌నట్స్‌, అవిసెలు, దోసగింజలు, సన్‌ఫ్లవర్‌ గింజలు వంటివి తినాలి. 

మాంసాహారులైతే పచ్చసొన, చేపలు తింటే మంచిది. ముఖ్యంగా పిల్లలు తినే ఆహారంలో ఇవన్నీ ఉండేట్టు చూస్తే కంటిసమస్యలు తలెత్తవు. ఫ్రూట్స్‌, నట్స్‌, పొట్టు ధాన్యాలు, తృణధాన్యాలు పిల్లలకు బాగా పెట్టాలి. వీటి వల్ల మైక్రో న్యూట్రియంట్లు వారికి అందుతాయి.  

చాలామంది మధుమేహం, బీపీ వంటి లైఫ్‌స్టైల్‌ జబ్బుల బారిన పడుతున్నారు. వీటి వల్ల కళ్లల్లో బ్లాక్స్‌ ఏర్పడటం, రక్తప్రసరణ తక్కువ కావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దాంతో త్వరగా కాటరాక్ట్స్‌, గ్లొకొమా లాంటివి వస్తాయి. అందుకే బ్లడ్‌షుగర్‌, బ్లడ్‌ ప్రెషర్లను నియంత్రణలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కంటి సమస్యలను నియంత్రించవచ్చు. అందుకే తగిన మోతాదులో పళ్లు, కూరగాయలు, పాలు, ప్రొటీన్లు బాగా తీసుకోవాలి. జింక్‌ ఎక్కువ ఉన్న ఆహారపదార్థాలు అంటే తెల్లసొన, గ్రీన్‌ వెజిటబుల్స్‌ వాడాలి. 

వీటితోపాటు సరైన వ్యాయామం ఉండాలి. అదేపనిగా స్మార్ట్‌ఫోన్‌ను, కంప్యూటర్‌ను చూడొద్దు. గంటకు ఒకసారి కొంత గ్యాప్‌ ఇస్తుండాలి. రెగ్యులర్‌గా కంటి చెకప్‌ చేయించుకోవాలి.


Updated Date - 2020-08-13T16:05:07+05:30 IST