నిండైన కనుబొమల కోసం

ABN , First Publish Date - 2020-08-31T05:30:00+05:30 IST

చర్మ, కేశ సమస్యలకు రకరకాల సౌందర్య ఉత్పత్తులు వాడతాం. సహజసిద్దంగా, రసాయనాలు లేని అలొవెరా జెల్‌తో చర్మాన్ని, కురులను అందంగా, ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. చర్మానికి సాంత్వన అందించే అలొవెరా ఫేస్‌, హెయిర్‌ ప్యాక్‌ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం...

నిండైన కనుబొమల కోసం

చర్మ, కేశ సమస్యలకు రకరకాల సౌందర్య ఉత్పత్తులు వాడతాం. సహజసిద్దంగా, రసాయనాలు లేని అలొవెరా జెల్‌తో చర్మాన్ని, కురులను అందంగా, ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. చర్మానికి సాంత్వన అందించే అలొవెరా ఫేస్‌, హెయిర్‌ ప్యాక్‌ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం...


హెయిర్‌ మాయిశ్చరైజర్‌: సీజన్‌ ఏదైనప్పటికీ కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల కురులు పొడిబారడం, నిర్జీవంగా కనిపిస్తాయి. ఈ సమస్యలు ఎదురైనప్పుడు అలోవెరా జెల్‌ను జుట్టుకు పట్టిస్తే సరి. వెంట్రుకలకు తేమ అంది మునుపటిలా తళతళలాడుతాయి.


కనుబొమలు ఒత్తుగా: అలొవెరా జెల్‌, ఆముదం నూనె పేస్ట్‌ కనుబొమలను ఒత్తుగా చేస్తుంది. ఈ పేస్ట్‌ను తరచూ వాడితే నిండైన కనుబొమలు సొంతమవుతాయి. 


చుండ్రు వదులుతుంది: బలహీనమైన కురులతో పాటు చుండ్రు కూడా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. చుండ్రు లేని జుట్టు కోసం తరచుగా కలబంద గుజ్జు వాడాలి. దాంతో జుట్టు చర్మం పొడిబారడం తగ్గిపోతుంది. మాడు భాగం తేమగా ఉంటుంది. చుండ్రు మాయం అవుతుంది.


ఫేస్‌ క్లీనర్‌: ముఖాన్ని తాజాగా ఉంచుకునేందుకు ఫేస్‌ క్లీనర్స్‌, మేకప్‌ రిమూవర్స్‌ వాడుతాం. అలోవెరా జెల్‌ కూడా ముఖం మీద ది మలినాలను తొలిగించి చర్మాన్ని కాంతిమంతంగా చేస్తుంది. అంతేకాదు చర్మానికి సాంత్వన, నిగారింపును ఇస్తుంది.


మచ్చలు మాయం: కలబందలోని సాలిసిలిక్‌ ఆమ్లం మచ్చలను తేలిగ్గా తొలగిస్తుంది. అలొవెరా జెల్‌ ముఖానికి రాసుకుంటే జిడ్డు, చర్మ రంధ్రాలు మూసుకుపోవడం వల్ల ఏర్పడిన మచ్చలు మాయమవుతాయి. అలానే మృతకణాలను వదిలి చర్మం తాజాదనంతో మెరుస్తుంది.


Updated Date - 2020-08-31T05:30:00+05:30 IST