చేతుల నిగారింపు కోసం...

ABN , First Publish Date - 2021-10-13T05:30:00+05:30 IST

ఎండ, కాలుష్యం వల్ల చేతులు నల్లబడిపోతుంటాయి. చర్మం పొడిబారి పోతుంది. అయితే ఇంట్లో లభించే పదార్థాలతో చర్మం తిరిగి నిగారింపు సంతరించుకునేలా చేయవచ్చు.

చేతుల నిగారింపు కోసం...

ఎండ, కాలుష్యం వల్ల చేతులు నల్లబడిపోతుంటాయి. చర్మం పొడిబారి పోతుంది. అయితే ఇంట్లో లభించే పదార్థాలతో చర్మం తిరిగి నిగారింపు సంతరించుకునేలా చేయవచ్చు. 

ఏం చేయాలంటే...

 ఒక బౌల్‌లో కొద్దిగా పెరుగు తీసుకుని అందులో ఒక టీస్పూన్‌ పసుపు వేసి పేస్టులా చేసి చేతులకు రాసుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్‌ స్కిన్‌ టోన్‌ పెరిగేలా చేస్తాయి. నలుపు తొలగిపోయేలా చేయడంలో సహాపడతాయి.

రాత్రి పడుకునే ముందు కలబంద జెల్‌ను చేతులకు రాసుకోవాలి. ఉదయాన్నే చల్లటి నీటితో కడిగేయాలి. కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మకణాలను కాపాడతాయి. నలుపుదనాన్ని పోగొడతాయి.

ఒక కప్పు కీర దోస జ్యూస్‌లో నాలుగైదు చుక్కల నిమ్మరసం వేయాలి. ఆ తరువాత పసుపు వేసి పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ పేస్టును చేతులకు రాసుకుని అరగంట తరువాత కడిగేసుకోవాలి. వారంలో ఒక రోజు ఇలా చేసినా మంచి ఫలితం కనిపిస్తుంది.

ఒక టీస్పూన్‌ గంధం పొడిలో, ఒక టీస్పూన్‌ పసుపు, కొద్దిగా రోజ్‌వాటర్‌ వేసి పేస్టులా తయారుచేసి చేతులకు రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే చర్మరంగు మెరుగవుతుంది.

Updated Date - 2021-10-13T05:30:00+05:30 IST