Abn logo
May 14 2021 @ 10:59AM

ఈ నంబర్‌కు కాల్ చేస్తే ఇంటికే భోజనం

  • సాయి సంస్థాన్‌ ఔదార్యం
  • కరోనా రోగులకు ఉచిత ఆహార పంపిణీ
  • 3 కిలో మీటర్ల లోపు డోర్‌ డెలివరీ

హైదరాబాద్/దిల్‌సుఖ్‌నగర్‌ : కరోనాతో బాధపడుతున్నవారు ఆహారం కోసం ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం ఉచిత ఆహారాన్ని పంపిణీ చేసేందుకు దిల్‌సుఖ్‌నగర్‌ షిర్డీసాయి సంస్థాన్‌ ట్రస్ట్‌ శ్రీకారం చుట్టింది. ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి చొరవతో ట్రస్ట్‌ సభ్యులు గురువారం పాలకమండలి సమావేశం ఏర్పాటు చేసి శుక్రవారం ఆహారాన్ని పంపిణీ చేసేందుకు తీర్మానం చేశారు. సంస్థాన్‌ నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి ఇంటికి వెళ్లి భోజనాన్ని అందజేయనున్నట్టు ట్రస్ట్‌ చైర్మన్‌ బచ్చు గంగాధర్‌, ఈవీవీ నాగేశ్వరరావు శర్మ, అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌ గుండా మల్లయ్య, వూర నర్సింహగుప్తా, శ్యామ్‌ వెల్లడించారు. 


ఫోన్‌ చేస్తే ఇంటికే భోజనం...

  • ఆహారం కావాల్సినవారు సాయి సంస్థాన్‌కు ఫోన్‌ (040-24150277, 040-24150184) ద్వారా  సమాచారం ఇవ్వాలి.
  • శుక్రవారం ఉదయం నుంచి భోజనం సరఫరా. 
  • ఆహారం కోసం ఒక రోజు ముందు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చినవారికి ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనానికి సరఫరా చేస్తారు.
  • దూర ప్రాంతాలవారికి ఆహారం కావాలంటే ముందు రోజు సమాచారం ఇచ్చి, రోగి సహాయకులు లేదా కుటుంబ సభ్యులు సంస్థాన్‌ వద్దకు వస్తే పార్శిల్‌ ఇస్తారు. 

Advertisement