కంటి బాధ పోవాలంటే...

ABN , First Publish Date - 2020-06-13T16:55:55+05:30 IST

నా కళ్లు ఎరుపెక్కడమేగాక మంటగా కూడా ఉంటున్నాయి. ఐడ్రాప్స్‌ వాడినా తగ్గడం లేదు. డాక్టర్‌ అది ఇరిటేషన్‌ మాత్రమే అంటున్నారు.

కంటి బాధ పోవాలంటే...

ఆంధ్రజ్యోతి(13-06-2020)

ప్రశ్న: నా కళ్లు ఎరుపెక్కడమేగాక మంటగా కూడా ఉంటున్నాయి. ఐడ్రాప్స్‌ వాడినా తగ్గడం లేదు. డాక్టర్‌ అది ఇరిటేషన్‌ మాత్రమే అంటున్నారు. దీనివల్ల కళ్లు కాంతి హీనంగా ఉంటున్నాయి. సరైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ బాధ నుంచి విముక్తి దొరుకుతుందా? 


-సుందరి, బెంగళూరు


డాక్టర్ సమాాధానం: కళ్ల ఇరిటేషన్‌ మామూలుగా దుమ్ము, ధూళి తగిలినప్పుడు వస్తుంది. సాధారణంగా చాలామంది గమనించరు కానీ ముఖంపైన ఉన్న ఆయిల్‌, జిడ్డు కళ్ల కొసలు, రెప్పల నుంచి కళ్లలోకి వెళ్లినపుడు కూడా ఇరిటేషన్‌ వస్తుంది. దీనికి పరిష్కారం ఏమిటంటే... రోజుకు మూడుసార్లు మంచినీళ్లతో కళ్లు కడుక్కోవడం. ఇక ఎలర్జీ నుంచి రక్షించుకోవడానికి... కళ్లు కాంతిమంతంగా ఉండటానికి ఆకుకూరలు, క్యారెట్‌, బీట్‌రూట్‌, బొప్పాయి, మామిడి పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిలో బీటా కెరోటిన్‌ సమృద్ధిగా లభిస్తుంది. ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆకుకూరల్లో గ్జాంతిన్‌, జీ గ్జాంతిన్‌, ల్యుటీన్‌ అనే ఎలిమెంట్స్‌ కంటి ఆరోగ్యానికి తోడ్పడుతాయి. వయసు వల్ల వచ్చే కంటి చూపు తేడాలు, కంటి కండరాల వీక్‌నెస్‌ను తగ్గిస్తాయి. కంటి ఆరోగ్యాన్ని రక్షించే సూప్‌ ఇది. ప్రతీరోజూ తీసుకోండి.


బీటా కెరోటిన్‌ రిచ్‌ సూప్


కావాల్సినవి: పావుకప్పు ఉడికించిన పప్పు, ఒక ఉడికించి మాష్‌ చేసిన క్యారెట్‌, ఒక పచ్చిమిర్చి, ఒక టీ స్పూను వెన్న, చిటికెడు మిరియాల పొడి, సరిపడా ఉప్పు.


తయారీ: బాండీ స్టవ్‌పై పెట్టి, వేడెక్కిన తర్వాత వెన్న, మిరియాల పొడి, ఉప్పు వేయాలి. ఒక్క క్షణం ఆగి, మెత్తగా మాష్‌ చేసిన క్యారెట్‌ గుజ్జు వేసి కాసేపు వేగించాలి. తర్వాత మెత్తగా ఉడికించిన కందిపప్పు వేసి కలపాలి. అందులోనే పచ్చిమిర్చి వేసి, కొద్దిగా నీళ్లు పోసి మరగనిచ్చి దింపాలి. అందులో కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే బీటా కెరోటిన్‌ రిచ్‌ సూప్‌ రెడీ. ఇందులో క్యారెట్‌ బదులుగా పాలకూర కూడా వాడొచ్చు.


-డాక్టర్‌ బి.జానకి, న్యూట్రిషనిస్ట్‌

drjanakibadugu@gmail.com


Updated Date - 2020-06-13T16:55:55+05:30 IST