తొగరపాయలో మట్టి తవ్వకాలకు..హైకోర్టు బ్రేక్‌

ABN , First Publish Date - 2020-08-04T11:34:07+05:30 IST

రుపేదలకు ఇళ్లస్థలాలు పం పిణీ కోసం ప్రభుత్వం సేకరించిన భూములను మెరక చేసేం దుకు చేపడుతున్న మట్టి ..

తొగరపాయలో మట్టి తవ్వకాలకు..హైకోర్టు బ్రేక్‌

ఇళ్లస్థలాల మెరక పేరిట గోదావరి నదీపాయనే చెరపడుతున్నారు

అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన హెడ్‌వర్క్స్‌ అధికారులు

హైకోర్టు ఆదేశంతో నిలిచిన తవ్వకాలు

మట్టిమాఫియా ఎత్తుగడలకు బ్రేక్‌


(అమలాపురం-ఆంధ్రజ్యోతి): నిరుపేదలకు ఇళ్లస్థలాలు పం పిణీ కోసం ప్రభుత్వం సేకరించిన భూములను మెరక చేసేం దుకు చేపడుతున్న మట్టి తవ్వకాలకు న్యాయస్థానాలు సైతం బ్రేక్‌లు వేస్తోంది. ఇళ్లస్థలాల మెరకకోసం గోదావరి నదీపాయ లు, లంక ప్రాంతాలు, పట్టా భూములు ఇలా ఎక్కడ మట్టి దొరికితే అక్కడ ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తున్నారు. ఇళ్ల స్థలాలకోసం రెండు లారీల మట్టి వెళ్తే పది లారీల మట్టి ఇటు క బట్టీలు, లేఅవుట్‌ సైట్ల మెరకకు తరలిపోతున్నాయి. ఒక తహశీల్దార్‌ చేసిన విజ్ఞాపన మేరకు ఏకంగా గోదావరి నదీపాయలోని మట్టిని తరలించుకుపోయేందుకు ఇరిగేషన్‌ అధికారులు ఇష్టారాజ్యంగా ఇచ్చిన అనుమతికి హైకోర్టు బ్రేక్‌ వేసింది. ఈ తరహా కేసులు కోనసీమతో సహా జిల్లావ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మట్టి తవ్వకాలకు న్యాయస్థానాలు బ్రేక్‌లు వేశాయి. కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఇళ్ల స్థలాల కోసం సేకరించిన పల్లపు భూములను మెరక చేసే లక్ష్యంతో రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు అధికారులు త లొగ్గి ఏకంగా గోదావరి పాయలనే తవ్వేందుకు అనుమతులు సాధిస్తున్నారు.


దీనిలోభాగంగా కొత్తపేట తహశీల్దార్‌ మే 21న హెడ్‌వర్క్స్‌ ఈఈ ఆర్‌.మోహనరావుకు కొత్తపేట మండల పరిధి గుండా వెళ్లే తొగరపాయలో బొండుమట్టి, ఇసుక తర లించుకునేందుకు అనుమతి కోరుతూ ఒక లేఖ రాశారు. దీని పై స్పందించిన సదరు హెడ్‌వర్క్స్‌ ఈఈ మోహనరావు కొత్త పేట మండల పరిధిలోని మందపల్లి, కొత్తపేట, వాడపాలెం ప్రాంతాల్లోని 94ఎకరాల మేర తొగరపాయ భూముల్లో ఒక మీటరు లోతున మట్టి తవ్వకాలకు అనుమతులు ఇచ్చేశారు. దీంతో రాజకీయ ముసుగులో ఉన్న కొందరు మట్టి మాఫియా ప్రతినిధులకు ఈ ఉత్తర్వులు వరంగా మారాయి. రెండు లారీ లు ఇళ్లస్థలాల మెరకకోసం తరలిస్తే మిగిలిన ఎనిమిది లారీ లు వివిధ ప్రాంతాల్లో విక్రయాలు, లేఅవుట్లు మెరక చేయడం, లంకమట్టి కావడంతో ఇటుక బట్టీలకు మళ్లించడం వంటి కార్యకలాపాలు జోరుగా సాగుతున్న తరుణంలో కొత్తపేటకు చెందిన ప్రముఖ న్యాయవాది బండారు భాస్కరరావు హైకోర్టు లో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మట్టి తవ్వకాలవల్ల సమీపంలోని రైతులకు చెందిన భూములు నదీపాతానికి గురికావడంతోపాటు భవిష్యత్తు రోజుల్లో గోదావరి పాయను ఆనుకుని ఉన్న ఏటిగట్టు సైతం కోతకు గురవుతుందన్న రైతు ల విజ్ఞప్తిపై భాస్కరరావు దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ నెంబ రు 10773/2020ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.


హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేష్‌రెడ్డి గతనెల 22న ఇం టీరియం ఆర్డరును జారీ చేసింది. ప్రస్తుతం ఇరిగేషన్‌శాఖ అధికారులు మంజూరు చేసిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు ఇవ్వడంతో అక్కడ మట్టి తవ్వకాలకు బ్రేక్‌ పడింది. ఈకేసులో ఇరిగేషన్‌, జిల్లా కలెక్టర్‌, ఆర్డీవో, తహశీల్దార్‌లను ప్ర తివాదులుగా చేరుస్తూ పిటిషన్‌ దాఖలైంది. ఈనెల 5న జస్టి స్‌ సురేష్‌రెడ్డి నేతృత్వంలో ఈ కేసుపై విచారణ కొనసాగనుం ది. అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ప్ర భుత్వవనరులను ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేస్తున్న తీరు పై న్యాయస్థానాలే రంగంలోకి దిగాల్సి వస్తోంది.

Updated Date - 2020-08-04T11:34:07+05:30 IST