Abn logo
Jan 18 2021 @ 05:12AM

దీపావళికి... థియేటర్లలోకి!

షాహిద్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్న ‘జెర్సీ’ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్‌ 5న విడుదల కానుంది. ఈ విషయాన్ని షాహిద్‌ ఆదివారం ప్రకటించారు. తానెంతో గర్వించే ప్రమాణం ఈ చిత్రమని చెప్పారు. తెలుగులో నాని హీరోగా నటించిన ‘జెర్సీ’కి రీమేక్‌ ఇది. మాతృకను తెరకెక్కించిన గౌతమ్‌ తిన్ననూరి హిందీ చిత్రానికీ దర్శకత్వం వహిస్తున్నారు. నాని పోషించిన పాత్రను హిందీలో షాహిద్‌ చేస్తుండగా... శ్రద్ధా శ్రీనాథ్‌ పాత్రలో మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తున్నారు. అమన్‌ గిల్‌తో కలిసి అల్లు అరవింద్‌, ‘దిల్‌’ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement