బిందె నీటి కోసం..

ABN , First Publish Date - 2022-07-04T04:51:36+05:30 IST

దొనకొండ మండలంలోని భూమనపల్లిలో 15 రోజుల నుంచి నెలకొంది. గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ఆరు నెలల క్రితం ఇంటింటికీ కొళాయి పథకంలో పైప్‌లైన్‌ ఏర్పాటు చేసి సాగర్‌ జలాలు సరఫరాకు కనెక్షన్‌ ఇచ్చారు. కానీ ఆ జలాలు సరఫరా కాకపోవటంతో ప్రజలకు నీటి కష్టాలు ఎదురయ్యాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

బిందె నీటి కోసం..
భూమనపల్లిలో నీళ్ల కోసం పడిగాపులు కాస్తున్న ప్రజలు


పైఫొటో పల్లెల్లో నీటి కష్టాలు తీవ్ర స్థాయిలో ముమ్మరించాయనేదానికి నిలువెత్తు సాక్షం..! కుళాయిల ద్వారా వచ్చే సన్నటి ధారను పట్టుకునేందుకు గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి. ఒక్క బిందె నిండడానికి కనీసం పది నిమిషాల సమయం పడుతుంది. అప్పటి వరకూ ఎదురుచూస్తేనే నీరు దొరుకుతుంది. ఈలోపు పొరపాటున పక్కకు వెళ్తే వంతు పోతుంది. మళ్లీ ఎదురుచూపులే.. ఈ దుస్థితి దొనకొండ మండలంలోని భూమనపల్లిలో 15 రోజుల నుంచి నెలకొంది. గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ఆరు నెలల క్రితం ఇంటింటికీ కొళాయి పథకంలో పైప్‌లైన్‌ ఏర్పాటు చేసి సాగర్‌ జలాలు సరఫరాకు కనెక్షన్‌ ఇచ్చారు. కానీ ఆ జలాలు సరఫరా కాకపోవటంతో ప్రజలకు నీటి కష్టాలు ఎదురయ్యాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గ్రామంలో గతంలో ఏర్పాటు చేసిన రెండు డీప్‌బోర్లకు పైప్‌లైన్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం సింగిల్‌ మోటార్‌తో నడుస్తున్న బోరు నీరు సరిపడా సరఫరా కావటం లేదని నీళ్ల కోసం ట్యాంకు వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇంటింటికీ కొళాయి పథకం ప్రారంభించామన్న పేరుతో గ్రామంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను రద్దు చేశారు. దీంతో గ్రామస్థుల కష్టాలు అన్నీఇన్నీ కావు. రెండురోజుల్లో నీటి సరఫరా జరుగుతుందని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ రామాంజనేయులు, చెప్పారు.          - దొనకొండ

Updated Date - 2022-07-04T04:51:36+05:30 IST