ఇంకెన్నాళ్లకో?

ABN , First Publish Date - 2021-07-27T06:45:14+05:30 IST

నల్లగొండ పట్టణాన్ని సుందరనగరంగా తీర్చిదిద్దాలని 2007లో యూజీడీ (అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ) పను లు ప్రారంభమయ్యాయి. యూజీడీ ద్వారా వచ్చే మురు గు నీటిని శుద్ధి చేసేందుకు ఎస్టీపీ సీవేజ్‌ ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్‌ (మురుగునీటి శుద్ధికేంద్రం)ను పట్టణ పరిధిలో ని శేషమ్మగూడెం వద్ద నిర్మించేందుకు 13ఏళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి.

ఇంకెన్నాళ్లకో?
నాణ్యతలేక కోతకు గురైన కల్వర్ట్‌

13 ఏళ్లుగా కొనసా..గుతున్న ఎస్టీపీ పనులు 

నాణ్యత డొల్ల.. అస్తవ్యస్తంగా యూజీడీ


రామగిరి: నల్లగొండ పట్టణాన్ని సుందరనగరంగా తీర్చిదిద్దాలని 2007లో యూజీడీ (అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ) పను లు ప్రారంభమయ్యాయి. యూజీడీ ద్వారా వచ్చే మురు గు నీటిని శుద్ధి చేసేందుకు ఎస్టీపీ సీవేజ్‌ ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్‌ (మురుగునీటి శుద్ధికేంద్రం)ను పట్టణ పరిధిలో ని శేషమ్మగూడెం వద్ద నిర్మించేందుకు 13ఏళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. నాటి నుంచి ఈ పనులు కొనసా..గుతునే ఉన్నాయి. ఈ పనులు ఇలా ఉండగా, యూజీడీ వ్యవస్థ గందరగోళంగా మారింది.పలుచోట్ల రోడ్డు మధ్యనుంచి వేసిన మ్యాన్‌హోల్స్‌ ధ్వంసమయ్యా యి. దీంతో మురుగు నీరంతా రోడ్లపైనే ప్రవహిస్తోంది. కొన్ని చోట్ల వరదకాల్వలు లేకపోవడం, మరికొన్ని చోట అవి ఆక్రమణకు గురవడంతో వర్షం వచ్చినప్పుడు వరద రోడ్లపైనే నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పానగల్‌ బైపా్‌సరోడ్‌, ఎన్టీఆర్‌ కాలనీలో వర్షం వచ్చినప్పుడు భారీగా వరద నిలుస్తోంది.


యూజీడీ పనులను 2007లో రూ.45కోట్లతో ఎల్‌ఎన్‌టీ సంస్థ టెండర్‌ దక్కించుకుంది. ఒప్పం దం ప్రకారం 220కిలోమీటర్ల పైపులైన్‌ను 2010 వరకు పూర్తిచేయాల్సి ఉంది. టెండర్‌ దక్కించుకు న్న ఎల్‌అండ్‌టీ సగం వరకే పనులు నిర్వహించి చేతులెత్తేసింది. దీంతో అధికారులు 2012లో మిగిలి న పనులు, ఎస్టీపీ నిర్మాణానికి రూ.25కోట్లతో మరోసారి టెండర్‌ పిలిచారు. దీన్ని కృషి ఇన్‌ఫ్రాస్టక్చర్‌ అనే సంస్థ దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం 2013వరకు పనులు పూర్తి చేయాల్సి ఉండగా, బిల్లు చెల్లింపులో జాప్యంతో నిర్ణీత సమయంలో చేపట్టలేకపోయింది.టీయూఎ్‌ఫఐడీసీ నుంచి నిధు లు కేటాయిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఏడాది క్రితం తిరిగి పనులు ప్రారంభమయ్యాయి. 2007 నుంచి 2021వరకు అంటే 13ఏళ్లు గా ఎస్టీపీ పనులు కొనసా..గుతూనే ఉన్నాయి. 


అస్తవ్యస్తంగా యూజీడీ

పట్టణంలో 220కిలోమీటర్ల మేర పైపులైన్లు, 10 వేల మ్యాన్‌హోల్స్‌తో యూజీడీ పనులు పూర్తయ్యా యి. అయితే ఎస్టీపీ పనులు పూర్తికాక అందుబాటులోకి రాకపోవడంతో యూజీడీ అస్తవ్యస్తంగా మారింది. కొన్ని చోట్ల మ్యాన్‌హోల్స్‌ మూత లు, మరికొన్ని చోట్ల పైపులైన్లు ధ్వంసమయ్యాయి. చాలామంది ఇళ్లనుంచి ఎవరికి వారు స్వతహాగా యూజీడీకి కనెక్షన్‌ ఇచ్చారు. ఫలితంగా మురుగునీరంతా రోడ్లపైనే ప్రవహిస్తోంది. ఎస్టీపీ పనులు పూర్తయితే ఈ సమస్య ఉండేది కాదు. పట్టణంలో రెండు ప్రాంతాల్లో ఎస్టీపీ నిర్మించాల్సి ఉంది. శేషమ్మగూడెం వద్ద పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. వల్లభరావు చెరువు వద్ద ఎస్టీపీ పనులు ఇంకా ప్రారంభానికే నోచుకోలేదు.


జాప్యానికి ఇదే కారణమా?

ఎస్టీపీ పనులు 2007లో ప్రారంభించగా, కొన్ని రోజులపాటు సజావుగా సాగింది. ఈ క్రమంలో యూజీడీ పైపులైన్లను తవ్వుతున్న క్రమంలో పెద్దసంఖ్యలో బండరాళ్లు అడ్డురాడంతో వాటిని తొలగిస్తే గిట్టుబాటు ఉండదని టెండర్‌ దక్కించుకున్న ఎల్‌ఎన్‌టీ సంస్థ చేతులెత్తేసినట్టు తెలిసింది. ఇదే క్రమంలో ఎస్టీపీ ఏర్పాటుకు భూ సేకరణలో జా ప్యం చోటుచేసుకుంది. రెండోమారు టెండర్‌ దక్కించుకున్న కృషి ఇన్‌ఫ్రాస్ట్రెక్చర్‌ సంస్థ పార్ట్‌టైమ్‌ బిల్లు లు రావడం లేదన్న కారణంతో పనులు నిలిపివేసినట్లు సమాచారం. ఏది ఏమైనా టెండర్‌ దక్కించుకున్న సంస్థలు నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయకపోవడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


నాణ్యతకు తిలోదకాలు 

యూజీడీ,  ఎస్టీపీ పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పనుల్లో నాణ్యత కొరవడుతోం ది. మురుగునీటిని దారి మళ్లించేందుకు ఏర్పాటుచేసిన కల్వర్టులు చిన్నపాటి వర్షానికే కోతకు గురవుతున్నాయి. శేషమ్మగూడెం ఎస్టీపీ ప్లాంట్‌లో పను లు నిలిచిపోవడంతో పిచ్చి చెట్లు ఏపుగా పెరిగా యి. ఫిల్టర్‌ బెడ్‌లో నాచు, జమ్మి చెట్లు పెరిగాయి. 


డిసెంబరులోగా పనుల పూర్తి : కందుకూరి వెంకటేశ్వర్లు, టీయూఎ్‌ఫఐడీసీ ఎస్‌ఈ

పట్టణంలో శేషమ్మగూడెం, వల్లభరావు చెరువు వద్ద రెండు ఎస్టీపీలు నిర్మించాల్సి ఉంది. శేషమ్మగూడెం వద్ద పనులు దాదాపు పూర్తయ్యాయి. డిసెంబరు నెలలోగా అన్ని పనులు పూర్తవుతాయి. పట్టణంలో యూజీడీ లైన్‌ క్లియర్‌ లేకపోవడంతో కొంతసమస్య ఏర్పడింది. వాటిని సరిచేయాలంటే ఖర్చుతో కుడుకున్న పని. ఈ సమస్యను పరిష్కరించి ఇంటర్నల్‌ కనెక్షన్‌ ఇస్తే మురుగునీటి సమస్య తొలగుతుంది. ప్రస్తుతం ఎస్టీపీ పనులు చురుకుగా సాగుతున్నాయి. పనుల్లో నాణ్యత పాటించకుంటే బిల్లులు నిలిపివేస్తాం.


Updated Date - 2021-07-27T06:45:14+05:30 IST