అఫ్ఘానిస్థానీలకు ఆశ్రయం ఇస్తున్న దేశాలు ఇవే..

ABN , First Publish Date - 2021-08-22T23:52:49+05:30 IST

తాలిబన్ల పాలనలో తమ భవిష్యత్తు చీకటిమయమవుతుందని భావిస్తున్న అనేక మంది అఫ్ఘానిస్థానీలు మాతృభూమిని వీడి ఇతర దేశాల పంచన చేరుతున్నారు.

అఫ్ఘానిస్థానీలకు ఆశ్రయం ఇస్తున్న దేశాలు ఇవే..

న్యూఢిల్లీ: తాలిబన్ల పాలనలో తమ భవిష్యత్తు చీకటిమయమవుతుందని భావిస్తున్న అనేక మంది అఫ్ఘానిస్థానీలు మాతృభూమిని వీడి ఇతర దేశాల పంచన చేరుతున్నారు. మరికొందరు మాత్రం తమ సంతానాన్నైనా దేశం నుంచి తరలించాలంటూ అమెరికా భద్రతా దళాలను వేడుకుంటున్నారు. కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద ఏర్పాటు చేసిన ఇనుప కంచెలపై నుంచి తమ చిన్నారులను భద్రతాసిబ్బందికి అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో కాబూల్  ఎయిర్ పోర్టు.. హృదయవిదారక దృశ్యాలకు వేదిక అవుతోంది. 


మరోవైపు.. అఫ్ఘాన్ శరణార్థులను ఆదుకునేందుకు పలు దేశాల ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. మాతృభూమిని వీడిన వారికి ఆశ్రయమిచ్చేందుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం.. అమెరికా, కెనడా, బ్రిటన్, భారత్, పాకిస్థాన్, ఇరాన్, ఉబ్జెకిస్థాన్, నార్త్ మాసెడోనియా, ఉగాండా,అల్బేనియా అండ్ కొసోవో, టర్కీ దేశాల ప్రభుత్వాలు అఫ్ఘాన్ శరణార్థులను తమ దేశంలోకి అనుమతిస్తున్నాయి. అయితే.. అధికశాతం మంది అప్ఘానిస్థానీలు దేశంలోనే మిగిలిపోతున్నారని ఐక్యరాజ్య సమితి తాజాగా పేర్కొంది.  తాలిబన్ల ద్వారా ప్రమాదం ఎదుర్కొంటున్న వారు దేశం విడిచిపెట్టేందుకు సులువైన, స్పష్టమైన మార్గం ఏదీ లేదని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. 

Updated Date - 2021-08-22T23:52:49+05:30 IST