Strong Spine: బలమైన వెన్నెముక కోసం, ఇంట్లో ఈ యోగా ఆసనాలను ట్రై చేయండి..

ABN , First Publish Date - 2022-09-24T18:05:42+05:30 IST

వెన్నుముకను దృఢంగా మార్చే యోగాసనాలను కూడా కలిపి చేయడం వల్ల అది మన శరీరాన్ని, వెన్నుముకను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

Strong Spine: బలమైన వెన్నెముక కోసం, ఇంట్లో ఈ యోగా ఆసనాలను ట్రై చేయండి..

వ్యాయామాలతో శరీరం ఫిట్ గా మారుతుంది. అయితే  రోజువారి వ్యాయామంలో మన వెన్నుముకను దృఢంగా మార్చే యోగాసనాలను కూడా కలిపి చేయడం వల్ల అది మన శరీరాన్ని, వెన్నుముకను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. వెనుక భాగానికి సంబంధించి ఎలాంటి వ్యాయామాలు ఎంచుకోవాలి.


పని వేళల్లో అదే పనిగా కూర్చుని ఉండిపోవడం, వంగి కూర్చున్నప్పడు, సోఫాలో టీవీ షోలు చూస్తున్నప్పుడు సరైన భంగిమలో ఉండకపోవడం వల్ల ఆ ప్రభావం వెన్నెముక మీద పడుతుంది. దీనితో రోజువారి కార్యక్రమల్లో శరీరానికి మంచి వ్యాయామం లేకుండా పోతుంది. ఫలితంగా వెన్నెముక గట్టిగా మారుతుంది. దానితో ద్రవత్వాన్ని కోల్పోతుంది. వెన్నెముక ఆరోగ్యం మన మిగతా అవయవాల మీద కూడా ప్రభావం చూపుతుంది. అందుకే వెన్ను నొప్పి నుండి ఉపశమనం కోసం తప్పనిసరిగా చేయవలసిన కొన్ని యోగా వ్యాయామాలు చూద్దాం.


1. (వంగటం) ముందుకు వంగి లేవడం..

ముందుకు వంగి లేవడం వల్ల వెన్నెముకను కిందికి తీసకువస్తుంది. దీనిని ఫార్వర్డ్ బెండ్ అని కూడా అంటారు. ఇది ఐదేళ్ళ వయసు పిల్లలు నుంచి ఈ ఆసనాన్ని ప్రయత్నించవచ్చు. వెన్ను, తొడలు, చీలమండలు సున్నితమైన నరాలు కలిగి ఉంటాయి. ఇవి ముందుకు వంగి లేవడం చేయడం వల్ల ఉత్తేజమవుతాయి.


2. బ్యాక్ బెండ్..

వెన్నెముక పైకి వెనుకకు కదిలించడం వల్ల మంచి వ్యాయాయం అవుతుంది. ఈ కదలికలు వెన్నెముకను బలపరుస్తాయి. ఛాతీ, భుజం కండరాలను దృఢంగా చేయడంలో సహకరిస్తాయి. ఈ ఆసనాన్ని ధనురాసనం, లేదా విల్లు భంగిమ అంటారు.


3. భ్రమణం..

భ్రమణం వెన్నెముకను తిప్పే ఆసనం. ఇది వెన్నెముకను ద్రవపదార్థం చేయడంలో సహాయపడుతుంది. 


4. సైడ్ బెండ్..

ఈ భంగిమ శరీరాన్ని ఎడమ నుంచి కుడి వైపుకు వంగి ఉంటుంది. త్రిభుజం భంగిమ. ఇది వెన్నుముకను నిటారుగా చేయడంలో సహాయపడుతుంది. శ్వాసను నియంత్రణలో ఉంచుతుంది.

Updated Date - 2022-09-24T18:05:42+05:30 IST