3-12 తరగతుల్లో చేరే విద్యార్థులకు అద్భుత అవకాశం.. సద్వినియోగం చేసుకోండి!

ABN , First Publish Date - 2021-12-06T16:06:34+05:30 IST

3-12 తరగతుల్లో..

3-12 తరగతుల్లో చేరే విద్యార్థులకు అద్భుత అవకాశం.. సద్వినియోగం చేసుకోండి!

రూ. 1000 కోట్ల ఫీజు రాయితీతో శ్రీచైతన్య - Infinity Learn Scholarship Exam


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): శ్రీచైతన్య - ఇన్ఫినిటీ లెర్న్‌.. దేశంలోనే అతిపెద్ద స్కాలర్‌షిప్‌ ఎగ్జామ్‌కు స్వీకారం చుట్టింది. 1000 కోట్ల రూపాయల ఫీజు రాయితో విద్యార్థులు 3 - 12 వ తరగతుల్లో చేరటానికి అవకాశం కల్పిస్తోంది. ఈ సందర్భంగా శ్రీచైతన్య - ఇన్ఫినిటీ లెర్న్‌ డైరెక్టర్‌ సుష్మ బొప్పన మాట్లాడుతూ.. ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో డిసెంబరు 18, 19వ తేదీల్లో, ఆఫ్‌లైన్‌లో 19వ తేదీన నిర్వహించనున్నామని తెలిపారు. పరీక్షను హాజరుకావాలనుకునే విద్యార్థులు ఆన్‌లైన్‌లో https://infinitylearn.com/score నందు రూ. 125 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి, స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు.


50% - 100% వరకు ఫీజు రాయితీ కోరేవారు ఫైనల్‌ పరీక్షను శ్రీచైతన్య క్యాంప్‌సలలో ఆన్‌లైన్‌లోనే రాయాలని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా శ్రీచైతన్య ట్యాప్‌ ర్యాంకర్ల ప్రోగ్రాములైన ఐ.పి.ఎల్‌. సూపర్‌ 60, నీట్‌ సూపర్‌ 60 ప్రోగ్రాంలో చేరవచ్చన్నారు. ఇతర వివరాలకు https://infinitylearn.com/score , 04071045046 ఫోన్‌ నెంబర్‌ను సంప్రదించవచ్చని ఆమె తెలిపారు.  



Updated Date - 2021-12-06T16:06:34+05:30 IST