Abn logo
May 18 2021 @ 07:53AM

హైదరాబాద్‌ : కేటుగాళ్లు ఆఖరికి వీటిని కూడా వదలట్లేదు!

  • ఫుట్‌పాత్‌ టైల్స్‌ను దొంగిలిస్తున్న కేటుగాళ్లు


హైదరాబాద్/ఆనంద్‌బాగ్‌ : మల్కాజిగిరి ప్రధాన రహదారిలో సాయినగర్‌ వద్ద ఫుట్‌పాత్‌ నిర్మాణం కోసం ఉంచిన టైల్స్‌ను ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌పై తరలించుకు పోతున్న ఘటన  కెమెరాకు చిక్కింది. ఫుట్‌పాత్‌ కోసం సాయినగర్‌లో టైల్స్‌ను ఉంచారు. సోమవారం టీఆర్‌ 3442 తాత్కాలిక నంబరు గల మెరూన్‌ కలర్‌ యాక్సిస్‌ 125 కొత్త ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు రోడ్డు పక్కన పుట్‌పాత్‌ నిర్మాణం కోసం ఉంచిన టైల్స్‌లో కొన్నిటిని తీసుకుని తమ వాహనంపై పెట్టుకుని దొంగిలించుకుపోయారు. దీనిని గమనించిన స్థానికులు కొందరు తమ కెమారాల్లో బంధించారు.

Advertisement