ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై నజర్‌

ABN , First Publish Date - 2022-09-29T16:11:37+05:30 IST

నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ జామ్‌లకు ఫుట్‌పాత్‌ ఆక్రమణలు కూడా కారణమని గుర్తించిన పోలీస్‌ అధికారులు వాటిపై దృష్టి సారించారు. ఫుట్‌పాత్‌పై రెండు నుంచి మూడు అడుగుల స్థలం

ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై నజర్‌

తొలగిస్తున్న అధికారులు

హైదరాబాద్‌ సిటీ: నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ జామ్‌లకు ఫుట్‌పాత్‌ ఆక్రమణలు కూడా కారణమని గుర్తించిన పోలీస్‌ అధికారులు వాటిపై దృష్టి సారించారు. ఫుట్‌పాత్‌పై రెండు నుంచి మూడు అడుగుల స్థలం కబ్జా చేసి చిరు వ్యాపారాలు, తమ వ్యాపారులకు సంబంధించిన వస్తువులు పెట్టడంతో కనీసం నడిచేందుకూ వీలు లేకుండా పోతోంది. ఇలాంటి కబ్జాలను గుర్తించిన అధికారులు ఫుట్‌పాత్‌లను క్లియర్‌ చేయడం ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని ప్రధాన రోడ్లపై ఉన్న ఆక్రమణలను ట్రాఫిక్‌ అఽధికారులు దగ్గరుండి తొలగించి రోడ్లపై వాహనాలు సునాయాసంగా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. సైఫాబాద్‌, అయోధ్య జంక్షన్‌, పంజాగుట్ట ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ బస్టాప్‌, నర్సింగ్‌ షాపుల వద్ద ఉన్న ఫుట్‌పాత్‌ ఆక్రమణలను వారం రోజుల క్రితం తొలగించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సునాయాసంగా సాగుతోందని అధికారులు తెలిపారు. ఇతర ప్రాంతాల్లోనూ ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై దృష్టి సారించి వాహనదారులకు అనుకూలంగా మలుస్తామని చెప్పారు. ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేసే వారికి అవగాహన కల్పిస్తున్నారు.

Updated Date - 2022-09-29T16:11:37+05:30 IST