బీచ్‌లో దొరికిన కాలు.. ఆరా తీస్తే షాకింగ్ నిజం!

ABN , First Publish Date - 2021-02-27T06:33:56+05:30 IST

బిజినెస్ చేసి బాగా డబ్బులు సంపాదించాలని చాలా మంది కలలు కంటారు. వారిలో కొంత మంది తప్పులు చేసి కోట్లు కొల్లగొడుతుంటారు. ఇలాంటి పని చేసిన వారు చివరకు ఏమవుతారో చెప్పలేం. ఇదిగో ఇలాంటి విషాద ఘటనే ఆస్ట్రేలియాలో వెలుగు చూసింది. మెలిస్సా కాడిక్ అనే మహిళకు బిజినెస్ చేయాలని కోరిక.

బీచ్‌లో దొరికిన కాలు.. ఆరా తీస్తే షాకింగ్ నిజం!

సిడ్నీ: బిజినెస్ చేసి బాగా డబ్బులు సంపాదించాలని చాలా మంది కలలు కంటారు. వారిలో కొంత మంది తప్పులు చేసి కోట్లు కొల్లగొడుతుంటారు. ఇలాంటి పని చేసిన వారు చివరకు ఏమవుతారో చెప్పలేం. ఇదిగో ఇలాంటి విషాద ఘటనే ఆస్ట్రేలియాలో వెలుగు చూసింది. మెలిస్సా కాడిక్ అనే మహిళకు బిజినెస్ చేయాలని కోరిక. అనుకున్నట్లే బిజినెస్ వుమెన్ అయింది. అయితే వ్యాపారం సరిగా సాగలేదో, లేక ఆది నుంచే అదే ఆలోచనలో ఉందో తెలియదుగానీ.. మొత్తమ్మీద తన క్లయింట్ల వద్ద నుంచి 13 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు సేకరించింది.


అంటే మన లెక్కల ప్రకారం 74 కోట్ల రూపాయల పైమాటే. ఆ తర్వాత ఈ డబ్బుతో ఆమె మాయమైంది. సిడ్నీలోని ఆమె ఇంటిపై ఫెడరల్ పోలీసులు రెయిడ్ చేశారు. అప్పటి నుంచి ఆమె కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లిందో తెలియదు. లేక ఎవరైనా కిడ్నాప్ చేశారో కూడా సమాచారం లేదు. గతేడాది నవంబరు 12 నుంచి ఇదే పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియాలోని ఓ బిజీ బీచ్‌లో ఆమె కాలు కనిపించింది. ఈ వార్త స్థానికుల్లో కలకలం రేపింది. ఆ కాలును చూసిన కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీన్ని పరీక్షించిన పోలీసులు.. ఆ కాలు మెలిస్సాకు చెందినదేనని గుర్తించారు. ఆమె ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తారు.

Updated Date - 2021-02-27T06:33:56+05:30 IST