ఆహారాన్ని గబగబా తినే అలవాటు ఉందా? అయితే వెంటనే..

ABN , First Publish Date - 2022-04-19T18:40:22+05:30 IST

ఏ సమయంలో ఎలాంటి ఆహారం తినాలో, పదార్థాల్లోని పోషకాలను సక్రమంగా ఎలా ఉపయోగించుకోవాలో మనలో చాలా మందికి తెలియదు. ఆకలేస్తే తినటం

ఆహారాన్ని గబగబా తినే అలవాటు ఉందా? అయితే వెంటనే..

ఆంధ్రజ్యోతి(19-04-2022) 

ఏ సమయంలో ఎలాంటి ఆహారం తినాలో, పదార్థాల్లోని పోషకాలను సక్రమంగా ఎలా ఉపయోగించుకోవాలో మనలో చాలా మందికి తెలియదు. ఆకలేస్తే తినటం ఒక్కటే కాదు...ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? ఎలా తింటున్నాం? అనే విషయాలను కూడా గమనించాలి.


ఎప్పుడు తినాలి?: ఆహార వేళలు క్రమం తప్పకుండా కచ్చితంగా పాటించటం వల్ల అసిడిటీ, అజీర్తి లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. భోజనానికి, భోజనానికి మధ్య మరీ ఎక్కువ లేదా మరీ తక్కువ సమయం పాటించటం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు అస్థవ్యస్థమవుతుంది. అలాగే ఆకలి వేసినప్పుడే తినాలి. ఏ కారణం చేతనైనా ఆకలి వేయకపోతే సమయానికి తినాలి కాబట్టి తినటం కూడా సరైన పద్ధతి కాదు. 


ఎలా తినాలి?: ఆహారాన్ని గబగబా తినే అలవాటు మంచిది కాదు. అలాగే తినే సమయంలో మాట్లాడకూడదు. ఇలా చేస్తే ఆహారంతోపాటు గాలి కూడా జీర్ణాశయంలోకి చేరి అజీర్తిని కలిగిస్తుంది. నోట్లోనే సగం ఆహారం జీర్ణమవుతుంది. కాబట్టి పదార్థాలను బాగా నమిలి మింగాలి. తినే సమయంలో కాకుండా తిన్న తర్వాతే నీళ్లు తాగాలి. 


ఎప్పుడు ఏం తినాలి?: బలవర్థక పోషకాలైన ప్రొటీన్లను ఉదయం అల్పాహారంలో తీసుకోవాలి. గుడ్లు, అరటిపళ్లు లాంటివి బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకుంటే రోజు మొత్తం అలసటకు లోనవకుండా ఉంటాం. సాధారణంగా భోజనం తర్వాత పళ్లు తినటం మన అలవాటు. కానీ పళ్లను ఖాళీ కడుపుతో తినాలి. లేదా భోజన విరామ సమయంలో తినాలి. నిద్రకు రెండు గంటల ముందే భోజనం ముగించాలి. ఉదయం భారీగా, మధ్యాహ్నం మధ్యస్తంగా, రాత్రి వేళ స్వల్పంగా ఆహారం తీసుకోవాలి.


ఎంత తినాలి?: రోజుకి అవసరమయ్యే క్యాలరీల సంఖ్య జీవనశైలి, వయసులనుబట్టి మారుతుంది. కాబట్టి వాటికి తగినట్టు ఆహార నియమాలు పాటించాలి. అలాగే మెటబాలిజం వేగంగా ఉండే యుక్తవయస్కులు, క్రీడాకారులు, రోజు మొత్తంలో ఎక్కువ సమయంపాటు నడక, ఇతరత్రా పనులు చేసే ఉద్యోగులు ఖర్చయ్యే క్యాలరీలకు సరిపడా ఆహారం తీసుకోవాలి. ఇంటి పట్టున విశ్రాంతిలో ఉండే వృద్ధులు తేలికగా అరిగే, తక్కువ క్యాలరీలుండే ఆహారం తీసుకోవాలి.

Updated Date - 2022-04-19T18:40:22+05:30 IST