వర్షాల వేళ ఆహారం ఇలా..!

ABN , First Publish Date - 2021-07-17T17:42:54+05:30 IST

వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ. ఈ సమయంలో ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా ఉండాలంటే ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సీజనల్‌ ఫుడ్‌ తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇంకా ఏ ఆహారం తీసుకోవాలంటే....

వర్షాల వేళ ఆహారం ఇలా..!

ఆంధ్రజ్యోతి(17-07-2021)

వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ. ఈ సమయంలో ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా ఉండాలంటే ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సీజనల్‌ ఫుడ్‌ తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇంకా ఏ ఆహారం తీసుకోవాలంటే....


ముసురు కమ్ముకున్న వేళ మొక్కజొన్న కండెలను కాల్చుకుని తింటుంటే ఆ మజాయే వేరు. ఈ సీజన్‌లో ఇది మంచి ఫుడ్‌. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్‌ ఉంటుంది. ల్యూటిన్‌తో పాటు మంచి దృష్టికి అవసరమైన ఫైటో కెమికల్స్‌ ఇందులో ఉంటాయి. కార్న్‌లో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణశక్తిని పెంచుతుంది. కార్న్‌ను ఉడికించి తీసుకున్నా పోషకాలు అందుతాయి.


ఈ సీజన్‌లో జీర్ణకోశ సంబంధ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా ప్రబలుతుంటాయి. వీటిని ఎదుర్కోవాలంటే రోజూ అరటిపండ్లు తినాలి. విటమిన్లు, మినరల్స్‌తో పాటు ఆహారం సరిగ్గా జీర్ణంకావడానికి అరటిపండు ఉపయోగపడుతుంది. అరటిలో ఉండే అబ్జార్బిక్‌ యాసిడడ్‌, రెటినాల్‌ ఇమ్యూనిటీని పెంచుతాయి. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్‌ ఉంటుంది. 


కండరాల శక్తి కోసం కోడిగుడ్లు తీసుకోవాలి. ప్రొటీన్‌ సమృద్ధిగా లభించడంతో పాటు ఇన్‌ఫెక్షన్లపై పోరాటం చేసేందుకు వీలుగా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. 


ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా ఉండాలంటే సీజనల్‌ ఫ్రూట్స్‌పై దృష్టిపెట్టాలి. బొప్పాయి, దానిమ్మ, పియర్స్‌, లిచీ వంటి పండ్లను తీసుకోవాలి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా కాపాడతాయి. 


బ్యాక్టీరియా ఇన్‌ఫెక్లన్లు దరిచేరకుండా ఉండటం కోసం కొబ్బరి నీళ్లు తాగాలి. శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ బయటకు పంపడానికి సహాయపడే ఎలకో్ట్రలైట్స్‌ ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కొబ్బరి నీళ్లు మంచి ఛాయిస్‌. 

Updated Date - 2021-07-17T17:42:54+05:30 IST