Advertisement
Advertisement
Abn logo
Advertisement

పదహారేళ్ల అమ్మాయికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి?

ఆంధ్రజ్యోతి(10-02-2020)

ప్రశ్న: మా పాపకు పదహారేళ్లు. శాకాహారి, క్రీడాకారిణి. ఎలాంటి ఆహారం ఇవ్వాలి?


- తేజస్విని, విజయవాడ


డాక్టర్ సమాధానం: సాధారణంగానే టీనేజీ పిల్లలకు పోషకాహార అవసరం ఎక్కువ. ఇక అథ్లెట్స్‌కు మరీ అవసరం. రోజువారీ శారీరక శ్రమతో పాటు అధికంగా వ్యాయామం చేయడం, ఆటలాడడం మీ పాప దినచర్యలో భాగం కాబట్టి ఆమెకు శక్తినిచ్చే ఆహారాన్ని ఇవ్వాలి. ముఖ్యంగా మంచి కార్బోహైడ్రేట్స్‌ అయిన అన్నం, గోధుమలు, రొట్టెలు, పాస్తా, చిరు ధాన్యాలు; శాకాహార ప్రొటీన్ల కోసం పప్పు ధాన్యాలు, సోయా, సెనగలు, అలసందలు లాంటి గింజలు; మీల్‌ మేకర్‌, పనీర్‌, సొయా పనీర్‌, పాలు, పెరుగు కూడా బాగా తీసుకోవాలి. ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం పల్లీలు, బాదం, జీడిపప్పు, ఆక్రోట్‌, పిస్తా లాంటివి తన ఆహారంలో చేర్చాలి. ఆట లేదా వ్యాయామానికి ముందు త్వరగా శక్తినిచ్చే అరటి, ఆపిల్‌ పండ్లు, ఎండు ద్రాక్ష, ఖర్జూరం లాంటివి మంచిది. వ్యాయామం ముగిసిన వెంటనే తగినన్ని నీళ్లు, పండ్లు, ప్రొటీన్‌ కోసం నట్స్‌, పాలు లాంటివి తీసుకోవాలి. ఈ వయసు ఆడపిల్లలకు, ముఖ్యంగా అథ్లెట్లకు విటమిన్లు, ఖనిజాల అవసరం ఎక్కువ కాబట్టి... అవి విరివిగా లభించే అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు రోజూ తప్పనిసరి. సమయానికి ఆహారంతో పాటు తగినంత నిద్ర అవసరం. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

[email protected] కు పంపవచ్చు)

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...