ఇక ఫుడ్‌ డోర్‌ డెలివరీ

ABN , First Publish Date - 2020-05-25T09:28:03+05:30 IST

పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) రూట్‌ మార్చింది. కరోనా నేపథ్యంలో పర్యాటకానికి అనుమతులు

ఇక ఫుడ్‌ డోర్‌ డెలివరీ

ఆంధ్రజ్యోతి, విజయవాడ : పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) రూట్‌ మార్చింది. కరోనా నేపథ్యంలో పర్యాటకానికి అనుమతులు లేకపోవటంతో నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఫుడ్‌ ఫెస్టివల్స్‌ పేరిట తమ రెస్టారెంట్లలో ఘుమఘుమల రుచులను పర్యాటకులకు అందించనుంది. వీటిని డోర్‌ టు డోర్‌ డెలివరీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. జొమాటో, స్విగ్గీ తరహాలో ఆన్‌లైన్‌లో  ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ ద్వారా మొబైల్‌ అప్లికేషన్లను తీసుకురానుంది. ఆంధ్రా బ్రాండ్‌ వంటకాలు, మొగలాయ్‌, దక్షిణాది వంటకాలు, దేశీయంగా ప్రముఖ వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ బిర్యానీలు, ఆంధ్రా పిండి వంటలు, స్వీట్లు, పచ్చళ్లు.. ఇలా అనేక రకాల కేటగిరీలను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటిని డోర్‌ డెలివరీ చేసేందుకు కమీషన్‌ పద్ధతిలో టూ వీలర్‌ కలిగిన వారిని తీసుకోనున్నారు. 

Updated Date - 2020-05-25T09:28:03+05:30 IST