అనాథలకు అన్నదానమే లక్ష్యం

ABN , First Publish Date - 2021-05-12T07:13:20+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో భోజన హోటళ్లు లేక ఇబ్బంది పడుతున్న పలువురు అనాథలకు బిచ్చగాళ్లకు, మతిస్థిమితం లేనివారికి హెచ్‌డబ్యూసీ తరఫునఅన్నదానం అందజేస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థా పకుడు షేక్‌ మౌలానా, షరీఫ్‌ హుస్సేనీ తెలిపారు.

అనాథలకు అన్నదానమే లక్ష్యం
వృద్ధురాలికి భోజనం అందజేస్తున్న సభ్యులు

అనాథలకు అన్నదానమే లక్ష్యం 

పామూరు, మే 11:  కరోనా లాక్‌డౌన్‌ సమయంలో భోజన హోటళ్లు లేక ఇబ్బంది పడుతున్న పలువురు అనాథలకు బిచ్చగాళ్లకు, మతిస్థిమితం లేనివారికి హెచ్‌డబ్యూసీ తరఫునఅన్నదానం అందజేస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థా పకుడు షేక్‌ మౌలానా, షరీఫ్‌ హుస్సేనీ తెలిపారు. లాక్‌డౌన్‌ రెండవ విడత అన్నదాన కార్యక్రమాన్ని సోమవారం రాత్రి నుంచి ప్రారంభించారు. కరోనా మహమ్మారి వైరస్‌ తగ్గి అధికారులు లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకు అన్నదాన కార్యక్రమాలను యథాతథంగా చేపడతామన్నారు. నిత్యం 100 మందికి పైగా భోజనాలు తయారు చేసి వాటిని ప్యాకెట్లుగా మార్చి నిరుపేద, అభాగ్యులకు అందజేస్తున్నామన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొని తమ సేవా కార్యక్రమాలను అందించేందుకు సభ్యులు సిద్ధంగా ఉన్నారని షరీఫ్‌ తెలిపారు.

Updated Date - 2021-05-12T07:13:20+05:30 IST