వీధి వ్యాపారులకు త్వరలో వంటల పోటీలు

ABN , First Publish Date - 2020-12-06T05:41:57+05:30 IST

కార్పొరేషన్‌ (కాకినాడ), డిసెంబరు 5: కాకినాడ స్మార్ట్‌సిటీ ఆధ్వర్యాన వీధి వ్యాపారులు, తోపుడుబండ్లపై పానీపూరి, మిర్చి బజ్జీ, ఆహార పదార్థాలు, వెజ్‌, నాన్‌వెజ్‌ అమ్మకాలు చేసే వారికి త్వరలో వంటల పోటీలు నిర్వహించనున్నట్టు మున్సిపల్‌ కమిషనల్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్

వీధి వ్యాపారులకు త్వరలో వంటల పోటీలు

కార్పొరేషన్‌ (కాకినాడ), డిసెంబరు 5: కాకినాడ స్మార్ట్‌సిటీ ఆధ్వర్యాన వీధి వ్యాపారులు, తోపుడుబండ్లపై పానీపూరి, మిర్చి బజ్జీ, ఆహార పదార్థాలు, వెజ్‌, నాన్‌వెజ్‌ అమ్మకాలు చేసే వారికి త్వరలో వంటల పోటీలు నిర్వహించనున్నట్టు మున్సిపల్‌ కమిషనల్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ వీధి వ్యాపారులను ప్రోత్సహించడం, వీధి ఆహార విక్రేతల గుర్తింపును ధ్రువీకరించడం కోసం ఈ పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి, మెప్మా అర్బన్‌ పరిధిలో ఆసక్తి ఉన్నవారు తమ పేరు, వ్యాపారం పేరు, తయారీ వంటకాల మెనూ, ఫుడ్‌కార్డ్‌ ఫొటోలతో దరఖాస్తులను స్మార్ట్‌సిటీ మెయిల్‌కు వారంరోజుల్లో పంపాలని కోరారు. లేదా టోల్‌ఫ్రీ నంబరు 180044250325లో సంప్రదించాలని తెలిపారు. అలాగే మున్సిపల్‌ కార్యాలయంలో దరఖాస్తు అందించవచ్చని చెప్పారు. పీఆర్‌ కాలేజీ రోడ్డులో పోటీలు నిర్వహిస్తామన్నారు. రుచికరమైన వంటకాలు చేసినవారికి నగదు ప్రోత్సాహకంతో పాటు ఫుడ్‌కోర్టులో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇస్తామని కమిషనర్‌ తెలిపారు. 

Updated Date - 2020-12-06T05:41:57+05:30 IST