భోజనం చేసిన తర్వాత వీటిని తింటున్నారా? అయితే జాగ్రత్త!

ABN , First Publish Date - 2022-05-31T17:41:34+05:30 IST

ఎలాంటి ఆహారమైనా ఆరోగ్యకరమే! అయితే కొన్ని పదార్థాలను కలిపి తినడం కంటే, విడిగా తినడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. కాబట్టి కలిపి తినకూడదని ఫుడ్‌ కాంబినేషన్స్‌ గురించి తెలుసుకుందాం.

భోజనం చేసిన తర్వాత వీటిని తింటున్నారా? అయితే జాగ్రత్త!

ఆంధ్రజ్యోతి(31-05-2022)

ఎలాంటి ఆహారమైనా ఆరోగ్యకరమే! అయితే కొన్ని పదార్థాలను కలిపి తినడం కంటే, విడిగా తినడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. కాబట్టి కలిపి తినకూడదని ఫుడ్‌ కాంబినేషన్స్‌ గురించి తెలుసుకుందాం.


భోజనంతో పండ్లు

సాధారణంగా మనం భోజనం చేసిన తర్వాత పండ్లు తింటూ ఉంటాం. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే జీర్ణాశయంలోకి చేరుకునే పండ్లు తేలికగా అరిగిపోయి, పేగుల్లోకి శోషణ చెందుతాయి. ఈ పళ్లకు మాంసం, ధాన్యాలు కలిస్తే అరుగుదల ఆలస్యమవుతుంది. ఆలోగా పండ్లు కుళ్లిపోయే ప్రక్రియ (ఫర్మెంటేషన్‌) మొదలవుతుంది. ఫలితంగా పేగుల లోపలి పొర దెబ్బతింటుంది. 


మాంసకృత్తులు, పిండి పదార్థాలు

మాంస ఉత్పత్తుల్లోని మాంసకృత్తులు, పిండి పదార్థాలతో కలిస్తే వాటిలోని మాక్రోన్యూట్రియెంట్స్‌ ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఈ రెండు పదార్థాల అరుగుదల కోసం ఉత్పత్తయ్యే జీర్ణరసాలు ఘర్షణకు లోనై, కడుపులో గ్యాస్‌ పుడుతుంది. దాంతో కడుపు ఉబ్బరిస్తుంది.

 

నిమ్మరసం, దగ్గుమందు

దగ్గుమందు తీసుకుంటున్నప్పుడు నిమ్మరసం జోలికి పోకూడదు. నిమ్మరసం కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్స్‌ను విరిచేస్తుంది. దాంతో దగ్గుమందులోని డెక్స్‌ట్రోమిథార్పాన్‌ ప్రభావం రెట్టింపవుతుంది. దాంతో తల తిరుగుడు, నిద్రలేమిలాంటి ఊహించని దుష్ప్రభావాలు బాధిస్తాయి.


పిండి పదార్థాలు, టమేటాలు

టమేటాల్లో సిట్రిక్‌ యాసిడ్‌ ఉంటుంది. వీటిని స్టార్చీ కార్బొహైడ్రేట్స్‌తో కలిపి తినడం ప్రమాదం. చిలకడ దుంపలు, బియ్యంలాంటి స్టార్చీ కార్బొహైడ్రేట్స్‌తో టమేటాలు కలిపి తినకూడదు.


Updated Date - 2022-05-31T17:41:34+05:30 IST