Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫుడ్‌తోమూడ్‌మారుతుంది!

ఆంధ్రజ్యోతి(20-09-2021)

ఆహారానికి, మానసిక స్థితికి సంబంధం ఉందని అంటున్నారు పోషకాహార నిపుణులు. సమతుల ఆహారం తీసుకుంటే మూడ్‌ కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందని వారు సూచిస్తున్నారు. మెదడు ఆరోగ్యానికి, ఆహారానికి సంబంధం ఉందని పరిశోధనల్లో సైతం వెల్లడైందని అంటున్నారు. మానసిక ఉత్తేజానికి ఉపయోగపడే  అలాంటి ఆహార విశేషాలు ఇవి..


డార్క్‌ చాక్లెట్‌లో ట్రిప్టోఫాన్‌ అనే అమైనో యాసిడ్‌ ఉంటుంది. దీని సహాయంతో మెదడు సెరటోనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. మూడ్‌ నియంత్రించడంలో సెరటోనిన్‌ అనే హార్మోన్‌ ముఖ్యపాత్ర పోషిస్తుంది.

గ్రీన్‌ టీ తాగితే బరువు తగ్గుతారు, ఇమ్యూనిటీ పెరుగుతుంది. అందరూ ఈ మాటే చెబుతారు. కానీ దాంట్లో కాటెచిన్‌ ఆనే యాంటీఆక్సిడెంట్‌ ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 

ఒమెగా 3 సమృద్ధిగా లభించే ఆహారం డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. ఇతర మానసిక స్థితులను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సాల్మన్‌, అవిసెలు, నట్స్‌లో ఒమెగా 3 అధికంగా ఉంటుంది. 

 నట్స్‌ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన మెగ్నీషియం లభిస్తుంది. ఒకవేళ మెగ్నీషియం లోపిస్తే డిప్రెషన్‌ బారినపడే అవకాశాలు పెరుగుతాయి.

ఒక కప్పు కాఫీ తాగితే ఎంతో రిలీఫ్‌ వస్తుంది. మూడ్‌ను మార్చే శక్తి కాఫీకి ఉంది. డొపమైన్‌ విడుదలయ్యే చేయడం ద్వారా కాఫీ మూడ్‌ను మారుస్తుంది.

క్యాప్సికంలో విటమిన్‌ - ఎ తో పాటు బి6 ఉంటుంది. మెదడు పనితీరుకు, అభివృద్ధికి అవసరమైన పోషకం ఇది. అంతేకాకుండా మూడ్‌పై ప్రభావం చూసే సెరటోనిన్‌, నార్‌ఫైన్‌ఫిర్న్‌ అనే హార్మోన్ల తయారీకి సహాయపడుతుంది. 

ప్రోబయోటిక్‌ బ్యాక్టీరియా అధికంగా ఉండే ఆహారం పొట్ట ఆరోగ్యానికి చాలా అవసరం. అంతేకాదు ఈ ఆహారం హ్యాప్పీ హార్మోన్‌ అయినటువంటి సెరటోనిన్‌ అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.


Advertisement

Health Latest newsమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...