Abn logo
Sep 21 2021 @ 08:50AM

ఆహారంలో బల్లి..17 మంది చిన్నారులకు అస్వస్థత

ఐసిఎఫ్‌(చెన్నై): కడలూరు జిల్లా తిరుచ్చో పురంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో బల్లి పడిన ఆహారం తిన్న 17 మంది చిన్నారులకు వాంతు లై స్పృహ తప్పి పడిపోవడంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పూంగొడి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం లో 20మంది చిన్నారులున్నారు. సోమవారం మధ్యాహ్నం భోజనం చేసిన విద్యార్థులకు ఒకరి తర్వాత మరొకరు వాంతులు చేసుకొని స్పృహ తప్పి పడిపోయారు. చుట్టుపక్కలవారు చిన్నారులను వెంటనే అంబులెన్స్‌లో కడలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆహారం వండిన పాత్రలో బల్లి పడిందని, అంగన్‌వాడీ సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.