మీ ఇంట్లో వృద్దులు sodium-Potassium లోపంతో బాధపడుతున్నారా?..అయితే ఇలా చేయండి

ABN , First Publish Date - 2022-07-09T21:55:32+05:30 IST

వృద్ధుల్లో వయసుతో వస్తున్న మార్పులు కుంగదీస్తూ ఉంటాయి. వృద్ధాప్యంలో పడిపోతున్నామని ఓపిక తగ్గుతుందని డిప్రెషన్(Depression)లోకి కూరుకుపోయేవారున్నారు.

మీ ఇంట్లో వృద్దులు sodium-Potassium లోపంతో బాధపడుతున్నారా?..అయితే ఇలా చేయండి

వృద్ధుల్లో(elderly) వయసుతో వస్తున్న మార్పులు కుంగదీస్తూ ఉంటాయి. వృద్ధాప్యంలో పడిపోతున్నామని ఓపిక తగ్గుతుందని డిప్రెషన్(Depression)లోకి కూరుకుపోయేవారున్నారు. వీటికి తోడు తెలియకుండానే శరీరంలో కలిగే పెద్ద మార్పుల్లో ఒకటి సోడియం-పొటాషియం(sodium potassium) స్థాయిలు తగ్గడం. ఇవి తగ్గిపోతున్నాయని కొన్ని లక్షణాల ద్వారా మనకు సంకేతాలు పంపినపుడు తక్షణమే డాక్టర్(Doctor) ని సంప్రదించడం మంచిది. వీటి వల్ల శరీరంలో వచ్చే మార్పులను గురించి తెలుసుకుందాం.


సోడియం(sodium): నరాలు, కండరాల సరైన పనితీరుకు సోడియం ఉపయోగపడుతుంది.  రక్తంలో ప్రసరించే ఖనిజ లవణం. ఇది మానవ శరీరానికి విలువైన మూలకాలను అందిస్తుంది. మన శరీరానికి సంబంధించి గుండె సమస్యలు, మూత్రపిండాలు, కాలేయం సంబంధిత సమస్యలు తలెత్తాయంటే దానికి సోడియం లోపం కూడా ఒక కారణం కావచ్చు. యాంటీ-డైయూరిటిక్ హార్మోన్ శరీరంలో అధిక మొత్తంలో ఉత్పత్తి అయినప్పుడు ఈ సమస్య వస్తుంది.


సోడియం లోపం లక్షణాలు ..

- అతిసారం

- తరచుగా వాంతులు

- డీహైడ్రేషన్(Dehydration) ఈ లక్షణాలన్నీ శరీరంలో సోడియం పరిమాణం తక్కువగా ఉండటం వల్ల ఏర్పడతాయి. రక్తంలో సోడియం స్థాయిలు లీటరుకు 135 నుంచి 145 మిల్లీలీక్వివెంట్లు కంటే తక్కువగా ఉన్నప్పుడు సోడియం లోపం మొదలవుతుంది. 


దీని ప్రధాన లక్షణాలు..

- విపరీతమైన దాహం

- మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం

- శరీరంలో ద్రవాలు పేరుకుపోవడం

 - సోడియాన్ని నష్టపోయే మందులు వాడటం

- సోడియాన్ని ఈ పదార్థాలు తినడం వల్ల తిరిగి పొందవచ్చు...

- బచ్చలికూర, క్యారెట్లు, వైట్ బీన్స్, చిలగడదుంపలు, జామపండ్లు, ఆప్రికాట్లు వీటిలో అత్యధిక స్థాయిలో సోడియం లభిస్తుంది. 

- పొటాషియం (Potassium) మనశరీరంలో జరిగే అనేక పనులు జరగటానికి కీలక పాత్ర పోషిస్తున్న ఖనిజం పొటాషియం. ఇది మంచి ఆరోగ్యానికి చాలా అవసరం. ఎందుకంటే ఇది శరీర ద్రవాలను నియంత్రిస్తుంది అలాగే కండరాలు నరాలు పనిచేయడానికి సహాయపడుతుంది. 


పొటాషియం లోపం వల్ల ఈ లక్షణాలు..

- శ్వాస తీసుకోవటం లో సమస్యలు 

- అరచేతులు, కాళ్లు, పాదాల్లో తిమ్మిర్లు

- పొటాషియం మన శరీరంలో కండరాల కదలికలకు, నరాలు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది. ద్రవాలు నియంత్రణలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. సరైన పోషకాహారం తీసుకోకపోవటం వల్ల పొటాషియం లోపం కలుగుతుంది.

-నోరు పొడిబారడం

- తక్కువ రక్తపోటు

- మగత

- గందరగోళం


సోడియం, పొటాషియం స్థాయిలు ఎలా ఉండాలి?

సోడియం: 136-145 mEq/l

పొటాషియం: 3.5-5.0 mEq/l


అసమతుల్యతకు కారణమేమిటి?

రెండు సందర్భాల్లో, పెద్దలు డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నప్పుడు లేదా శరీరంలో ఎక్కువ నీరు ఉన్నప్పుడు, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వచ్చే అవకాశం ఉంటుంది. 


ఈ జాగ్రత్తలు అవసరమే...

వృద్ధాప్యంలో ఆకలి మందగించటం మూలంగా చాలా మంది తినటం మానేస్తుంటారు. దీని వల్ల శరీరానికి తగినన్ని పోషకాలు అందకుండా పోతాయి. ప్రొటీన్ లోపం ఏర్పడుతుంది. శరీరంలో చర్మ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువవుతాయి. ఎక్కువగా కాల్షియం, ఐరన్ ఉండే ఆహారపదార్ధాలను తినాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ఆహారంగా తీసుకుంటేనే శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. 

పై లక్షణాలు లేని వృద్ధులలో కూడా సోడియం, పొటాషియం స్థాయిలను అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం ఆరోగ్యానికి మంచిదే.

Updated Date - 2022-07-09T21:55:32+05:30 IST