చాణక్య నీతి: కష్ట సమయాల్లో ఈ 3 విషయాలను గుర్తుంచుకోండి.. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది!

ABN , First Publish Date - 2022-01-02T12:58:03+05:30 IST

ఆచార్య చాణక్య తన దౌత్యం, రాజకీయ వ్యూహాలతో..

చాణక్య నీతి: కష్ట సమయాల్లో ఈ 3 విషయాలను గుర్తుంచుకోండి.. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది!

ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం.. ఎవరైనా సరే కష్టాల్లో చిక్కకున్నప్పుడు కొన్ని విషయాలను గుర్తించుకోవడం ద్వారా సమస్యల నుంచి బయటపడవచ్చు. 

ఆచార్య చాణక్య తన దౌత్యం, రాజకీయ వ్యూహాలతో చంద్రగుప్త మౌర్యుని చక్రవర్తిగా చేశారు. తనకున్న అవగాహన, రాజకీయ చతురతతో నంద వంశాన్ని తుదముట్టించి, సాధారణ పిల్లవాడిని మహారాజును చేశారు. చాణక్యుడు ఆర్థశాస్త్ర పండితుడు. చాణక్య తన చిన్న వయస్సులోనే అనేక గ్రంథాలను చదవడంతోపాటు, వేదాల పరమార్థాన్ని గ్రహించాడు. చాణక్యుడు ఉత్తమ అధ్యాపకుడు. చాలా కాలంపాటు తక్షశిలలో అధ్యాపకునిగా పనిచేశారు. ఆచార్య చాణక్య అనేక గ్రంథాలు రచించారు. 


ఆచార్య చాణక్యుడు.. తన నీతిశాస్త్రంలో జీవితంలోని అన్ని కోణాలను ప్రస్తావించారు. చెడు పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రశాంతంగా ఎలావుండవచ్చో ఆచార్య చాణక్య తన నీతిశాస్త్రంలో వివరించారు. చాణక్య తెలిపిన వివరాల ప్రకారం.. ఎవరైనా సరే. తమ జీవితంలో ఈ మూడు విషయాలను అలవరచుకుంటే ఎటువంటి సమస్యనైనాఎదుర్కోవచ్చు. ఆ మూడు విషయాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓర్పు

ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం.. మనిషి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కలవరపడకూడదు. చెడు పరిస్థితులు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులతో సామరస్యంగా ఉండాలి. ఇటువంటి సమయంలో ఆత్మవిశ్వాసం, నమ్మకం, ఓర్పు అనేవి ఎంతో ముఖ్యం. ఓపికతో వ్యవహరించడం ద్వారా చెడు పరిస్థితులను చక్కదిద్దుకోవచ్చు. 


సానుకూల దృక్పథం

చెడు సమయాల్లో సానుకూలంగా ఆలోచించాలని ఆచార్య చాణక్య తెలిపారు. సంక్షోభ సమయాల్లో ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఏం చేయగలమో ఆలోచించాలి. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి జీవితంలో విజయం సాధిస్తాడు.

తగిన వ్యూహం

ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోవడం ముఖ్యం. పరిస్థితులను ఎదుర్కోవడానికి తగిన వ్యూహం అవసరం. మనిషి తన అనుభవాల నుంచి ఏదోఒకటి నేర్చుకోవాలని చాణక్య సూచించారు. కష్టాలను సవాళ్లుగా తీసుకుని, వాటిని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తూ ముందుకు సాగాలని ఆచార్య చాణక్య సూచించారు.

Updated Date - 2022-01-02T12:58:03+05:30 IST