శాస్త్రవేత్తల సలహాలు పాటించాలి

ABN , First Publish Date - 2020-08-08T07:59:33+05:30 IST

శాస్త్రవేత్తల సాంకేతిక సలహాలతో రైతులు పంటలను పండించటం ఉత్తమమైన మార్గమని వ్యవసాయ సాంకేతిక సలహా మండలి ఉప సంచాలకులు ..

శాస్త్రవేత్తల సలహాలు పాటించాలి

 తోట్లవల్లూరు : శాస్త్రవేత్తల సాంకేతిక సలహాలతో రైతులు పంటలను పండించటం ఉత్తమమైన మార్గమని వ్యవసాయ సాంకేతిక సలహా మండలి ఉప సంచాలకులు వై.అనురాధ తెలిపారు.  చినపులిపాకలో శుక్రవారం వరి, చెరకు పంటలను పరిశీలించారు. రైతు భరోసా కేంద్రంలో రైతులతో ఇష్టాగోష్టి నిర్వహించి వరి, చెరకు పంటల సాగులో అవలంబించాల్సిన పద్ధతులను వివరించారు. అనవసరంగా సస్యరక్షణ చర్యలు చేపట్టవద్దని సూచించారు.  ఉయ్యూరు చెరకు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డి.సుధారాణి, మండల వ్యవసాయాధికారిణి వై.శోభారాణి, ఏఈవో కె.లక్ష్మణరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-08T07:59:33+05:30 IST