తండ్రి అడుగుజాడల్లో సాగుతా

ABN , First Publish Date - 2021-07-28T05:33:25+05:30 IST

తన తండ్రి, మాజీ మంత్రి, దివంగత బీవీ మోహాన్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తానని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

తండ్రి అడుగుజాడల్లో సాగుతా
నివాళి అర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, టీడీపీ నాయకులు

  1. ఎమ్మిగనూరును రాష్ట్రస్థాయిలో నిలిపిన బీవీ 
  2. కార్యకర్తలకు అండగా ఉంటా 
  3. బీవీ  వర్ధంతి సభలో జయనాగేశ్వరరెడ్డి


ఎమ్మిగనూరు, జూలై27: తన తండ్రి, మాజీ మంత్రి, దివంగత బీవీ మోహాన్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తానని  మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ఎమ్మిగనూరులో మంగళవారం మాజీ ఎమ్మెల్యే స్వగృహాంలో  బీవీ మోహన్‌రెడ్డి తొమ్మిదో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీవీ చిత్రపటానికి ఆయన తనయుడు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘననివాళి అర్పించారు. అంతకు ముందు బీవీ స్వగ్రామమైన ఉల్లిందకొండలోని బీవీ ఘాట్‌ దగ్గర జయనాగేశ్వరరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మిగనూరులో జరిగిన వర్ధంతి సభలో మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ తన తండ్రి ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలను ఎంతో అభివృద్ధి చేసి రాష్ట్రస్థాయిలో నిలిపారని అన్నారు.  బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచి వారి అభివృద్ధికి ఎనలేని కృషిచేశారన్నారు. బీవీ తనయుడిగా ఆయన అడుగు జాడల్లో నడిచి ఎమ్మిగనూరు అభివృద్ధికి పాటుపడతాన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, కార్యకర్తలు, నాయకులు ధైౖర్యంగా ఉండాలన్నారు. 

 

 బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ మంత్రి దివంగత బీవీ మోహన్‌రెడ్డి అని ఎమ్మిగనూరు మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ వేలూరు సంజన్న కొనియాడారు. మంగళవారం ఉల్లిందకొండలో  బీవీ ఘాట్‌ దగ్గర ఆయన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసి రాష్ట్రస్థాయిలో నిలిపారన్నారు. 


నందవరం: నందవరంలో  బీవీ మోహన్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమాలను టీడీపీ నాయకుడు పెద్దరాముడు, మైనార్టీ నాయకుడు షరీఫ్‌, మండల యూత్‌ అఽధ్యక్షుడు విశ్వనాథ్‌ బీవీ చిత్ర పటానికి పూలమా వేసి నివాళి అర్పించారు. నాయకులు బసప్ప, నాగేష్‌, నరసయ్య, గిర్ని ఈస, మల్లేష్‌ పాల్గొన్నారు.


ఉలిందకొండకు వెళ్లిన టీడీపీ నాయకులు: బీవీ మోహన్‌రెడ్డి ఘాట్‌ను సందర్శించి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్‌ డీవీ రాముడు, మండల ప్రధాన కార్యదర్శి రైస్‌మిల్‌ నారాయణరెడ్డి, కాశీంవలీ, గడ్డం నారాయణరెడ్డి, సోమలగూడురు వెంకటామిరెడ్డి, చంద్ర, డీలర్‌బాషా, ధర్మాపురం గోపాల్‌ పాల్గొన్నారు.


బీవీ సేవలు మరవరానివి


బీవీ మోహన్‌రెడ్డి ఎమ్మిగనూరు నియోజక వర్గానికి చేసిన సేవలు మరువలేనివి.   నందవరాన్ని నందనవనం చేసిన ఘనత ఆయనదే. తండ్రి బాటలోనే తనయుడు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి కూడా అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందారు.

దేశాయి మాధవరావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు


గోనెగండ్ల: దివంగత నేత, మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి సేవలు ఎమ్మిగనూరు ప్రజలు ఎన్నటికి మరువలేరని మండల టీడీపీ కన్వీనర్‌ నజీర్‌, గాజులదిన్నె హనుమంతు, బేతాళ బడేసా, ఎర్రబాడు శ్రీనివాసులు, తిరుపతయ్యనాయుడు, వేముగోడునబి, నూరహమ్మద్‌, యూనూష్‌, పెద్దనేలటూరు వీరన్నగౌడ్‌ అన్నారు. మంగళవారం మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి 9వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూట మాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు బీవీ ఎమ్మిగనూరుకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎమ్మిగనూరులో మాచాని సోమప్ప తరువాత  బీవీ మోహన్‌రెడ్డి అంత పేరు సంపాదించుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు చెన్నలరాయుడు, ఒంటెడుదిన్నె రమేష్‌ఆచారి, కడపల వెంకటేష్‌, కౌలుట్లయ్యనాయుడు, ఊట్లరంగస్వామి, ఫకృద్దీన్‌, కొత్తింటి ఫకృద్దీన్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రమేష్‌నాయుడు, రాంపురం రఫీ, మారేష్‌, నాగరాజు, కొండలషఫి, వినోద్‌ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


హెచ్‌ కైరవాడిలో రక్తదాన శిబిరం ఏర్పాటు


మండలంలోని హెచ్‌ కైరవాడి గ్రామంలో  బీవీ మోహనరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా గ్రామ టీడీపీ నాయకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరెడ్డి ప్రారంభించారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా బీవీ మాట్లాడుతూ దివంగత నేత మోహన్‌రెడ్డి ఎమ్మిగనూరు కు చేసిన సేవలు మరువ రానివని అన్నారు. ఆర్డీఎస్‌ కోసం టీడీపీ హయాంలో రూ. 2000 కోట్లు మంజూరు చేయిస్తే వైసీపీ ప్రభుత ్వం నిధులను నిలిపివేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిమ్మారెడ్డి, రాజేష్‌, రఘ, పెద్దనేలటూరు బసవరాజు స్వామి, చిన్ననేలటూరు నాగన్న, శ్రీను, రాము, పెద్దయ్య, విల్సన్‌  పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-28T05:33:25+05:30 IST