విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26న ఎర్త్ అవర్ పాటించాలని ప్రజలను కోరిన గవర్నర్ బిశ్వభూషణ్ పిలుపునిచ్చారు. రేపు రాత్రి 8.30 నుంచి 9.30 వరకు ఎర్త్ అవర్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతేనే లైట్లు వాడాలని కోరారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మేధావులు ముందుకు రావాలన్నారు. మనకు 29 థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయన్నారు. మేధావులు పర్యావరణ పరిరక్షణకు డిబేట్లు చేయాలన్నారు. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణన్ని అందించాలని గవర్నర్ పేర్కొన్నారు. అందరం ఆ దిశగా కార్యోన్ముఖులు కావాలని గవర్నర్ అన్నారు.
ఇవి కూడా చదవండి