జానపద కళాక్షేత్రం నిర్మించాలి

ABN , First Publish Date - 2022-06-26T06:39:01+05:30 IST

రాష్ట్రంలో అతి పెద్ద పుణ్యక్షేత్రమైన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కేత్రంలో జానపద కళాక్షేత్రం నిర్మించాలని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకరస్వామీజీ, మహేశ్వర గ్రూప్‌ అధినేత కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు అన్నారు. యా దగిరిగుట్టలో రాష్ట్రంలోని జానపద కళాకారులు సుమా రు 500మందికి శనివారం సన్మానం నిర్వహించారు.

జానపద కళాక్షేత్రం నిర్మించాలి
గుట్టలో మాట్లాడుతున్న విజయశంకరస్వామీజీ

అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకరస్వామీజీ

యాదగిరిగుట్ట రూరల్‌, జూన్‌ 25: రాష్ట్రంలో అతి పెద్ద పుణ్యక్షేత్రమైన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కేత్రంలో జానపద కళాక్షేత్రం నిర్మించాలని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకరస్వామీజీ, మహేశ్వర గ్రూప్‌ అధినేత కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు అన్నారు. యా దగిరిగుట్టలో రాష్ట్రంలోని జానపద కళాకారులు సుమా రు 500మందికి శనివారం సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం జానపద కళాకారులను ఆదుకోవాలన్నారు.ఇదిలా ఉంటే సన్మాన సభకు హాజరైన కళాకారులందరికీ చివరి నిమిషంలో జ్ఞాపికలు సరిపడా అందకపోవడంతో నిరాశ చెందారు. కార్యక్రమంలో జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్య క్షుడుభాస్కర్‌, బి.ఆర్‌. ప్రసాద్‌, కళాకారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T06:39:01+05:30 IST