Abn logo
Sep 23 2021 @ 00:44AM

వాణిజ్య పంటల సాగుపై దృష్టి సారించాలి

- పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు

సిరిసిల్ల, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సాగు నీటి వనరులు పెరిగాయని, రైతులు  వాణిజ్య పంటలవైపు దృష్టిసారించాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సిరిసిల్ల జిల్లాలో ఆయిల్‌పాం ప్యాక్టరీ ఏర్పా టుకు ముందుకొచ్చిన ఎఫ్‌జీవీ కంపెనీ ప్రతినిఽధుల బృందంతో మంత్రి  సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీ ఆర్‌ మాట్లాడుతూ సిరిసిల్లలో ఆయిల్‌పాం సాగుకు రైతులను ప్రోత్సహించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.  వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి మలేషియాలో పర్యటిం చనున్నామని, ఆయిల్‌పాం సాగుపై అధ్యయనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సిరిసిల్లతోపాటు రాష్ట్రంలో మరికొన్ని చోట్ల ఆయిల్‌ ఫ్యాక్టరీలు పెట్టేందుకు ముందు కొచ్చిన ఎఫ్‌జీవీ కంపెనీ యాజమాన్యాన్ని అభినందించారు. సిరిసిల్లలో ఫ్యాక్టరీతోపాటు సీడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌, ఆయిల్‌ పాం నర్సరీని ఏర్పాటు చేయాలని కోరారు. అంతకు ముందు కంపెనీ ప్రతినిధి సత్యనారాయణ ఆయిల్‌పాం పంటకు తెలం గాణలో ఉన్న అవకాశాలను వివరించారు. ప్రభుత్వం ఆయి ల్‌పాం సాగును ప్రోత్సహించడంతో వ్యవసాయం లాభ సాటిగా మారుతుందని, వేలాది మందికి ఆయిల్‌పాం ఫ్యాక ్టరీల్లో ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఆయిల్‌పామ్‌కు సం బంధించి మలేషియాలో తమ కంపెనీ చేస్తున్న సాగు, ప్రాసెసింగ్‌ వంటి అంశాలను అధ్యయనం చేయడానికి రావాలని ఆహ్వానించారు.

ఫ కోనరావుపేట: రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన సదసస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వచ్చే యాసంగిలో దొడ్డురకం వరి వేయవద్దన్నారు. ముఖ్యంగా ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ప్రతాపరెడ్డి, సర్పంచ్‌ రేఖ, ఎంపీటీసీ చారి, జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్‌రెడ్డి, భాస్కర్‌, ఏవో వెంకటరామవ్వ, సింగిల్‌విండో చైర్మన్‌ గుండ నర్సయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, శంకర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

కోనరావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆరుతడి పంటల అవగాహన సదస్సులో టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సింగిల్‌విండో చైర్మన్‌ బండ నర్సయ్య రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లో డబ్బులు చెల్లించామనడంతో బీజేపీ నాయకులు కలుగజేసుకొని 15 రోజులైనా డబ్బులు రైతుల ఖాతాల్లో పడలేదన్నారు.  రెండు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

ఫ ఇల్లంతకుంట : రైతులు వరికి బదులుగా ఆయిల్‌పాం సాగుపై దృష్టి సారించాలని జడ్పీవైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు సూచించారు. మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ దొడ్డు రకం ధా న్యాన్ని కొనుగోలు చేయబోమని కేంద్రం ప్రకటించిందన్నారు. సీఎం కేసీఆర్‌ రైతుల తరఫున వివరించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. వరికి బదులుగా వేరుశనగ, శనగ, పెసర, నువ్వులు తదితర పంటలను సాగు చేయాలని సూచించారు.  రైతుబంధు మండల కన్వీనర్‌ రాజిరెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతి,  సర్పంచ్‌ కూనబోయిన భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్యయాదవ్‌, రైతుబంధు జిల్లా డైరెక్టర్‌ ఏలేటి మాధవరెడ్డి, వ్యవసాయాధికారి సందీప్‌ పాల్గొన్నారు. 

ఫఎల్లారెడ్డిపేట: రైతులు వరి పంటలకు బదులు వాణిజ్య పంటలపై దృష్టి సారించాలని రైతు బంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్‌ గడ్డం నర్సయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌ క్లస్టర్‌ పరిధిలోని రైతులకు స్థానిక రైతు వేదికలో బుధవారం పంటల మార్పిడిపై అవగాహన సదస్సు నిర్వహించారు.  అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయాలన్నారు. ఆయిల్‌పాం, పొద్దుతిరుగుడు, వేరుశనగ పంటలను సాగు చేయాలన్నారు.  అనంతరం వాణిజ్య పంటల సాగు విధానంపై ఏవో భూమిరెడ్డి అవగాహన కల్పించారు. జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు, ఎంపీపీ రేణుక, సర్పంచులు బాల్‌రెడ్డి, దేవనందం, నర్సాగౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్‌ శంకర్‌, ఎంపీటీసీలు గీతాంజలి, మధు, నాయకులు కిషన్‌, శివరాం, రఘునందన్‌రావు, శ్రీనివాస్‌ రైతులు పాల్గొన్నారు.