‘ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి’

ABN , First Publish Date - 2022-01-29T04:29:20+05:30 IST

రైతులు ఆరుతడి పంటల సాగుపైనే దృష్టి సారించి అధిక లాభాలు పొందాలని మెదక్‌ జిల్లా వ్యవసాయాధికారి పరశురాంనాయక్‌ రైతులకు సూచించారు. శుక్రవారం అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్‌లోని పలువురు రైతులకు సంబంధించిన పంటలను పరిశీలించారు.

‘ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి’

అల్లాదుర్గం, జనవరి28: రైతులు ఆరుతడి పంటల సాగుపైనే దృష్టి సారించి అధిక లాభాలు పొందాలని మెదక్‌ జిల్లా వ్యవసాయాధికారి పరశురాంనాయక్‌ రైతులకు సూచించారు. శుక్రవారం అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్‌లోని పలువురు రైతులకు సంబంధించిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయశాఖ ఏఈవోలు పం టల సాగు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన సందర్భంగా వాటి వివరాలను సర్వేనంబర్ల ఆధారంగా పున:పరిశీలించారు. పంటల మార్పుతో భూమిలో సారవంతం పెరిగి అధిక దిగుబడి సాధించవచ్చునని రైతులకు సూచించారు. అధిక దిగుబడికి ఇష్టానుసారం గా క్రిమిసంహారకమందులు వాడొద్దని వ్యవసాయశాఖ అధికారుల సలహాలు, సూచనలతో పంటలను సాగు చేయాలన్నారు. ఆయన వెంట స్థానిక ఏవో రాజేష్‌, ఏఈఓ మహేష్‌, అమృత్‌, నవీన్‌, విఠల్‌రావు ఉన్నారు. 

Updated Date - 2022-01-29T04:29:20+05:30 IST