పరిశోధనలు, నూతన ఆవిష్కరణలపై దృష్టిసారించాలి

ABN , First Publish Date - 2022-09-23T09:13:10+05:30 IST

పరిశోధనలు, నూతన ఆవిష్కరణలపై దృష్టిసారించాలి

పరిశోధనలు, నూతన ఆవిష్కరణలపై దృష్టిసారించాలి

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు భారత్‌లో ప్రోత్సాహకాలు

వ్యర్ధాల నుంచి సంపద సృష్టించే నైపుణ్యాలు అవసరం

యువతకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పిలుపు

ఘనంగా విజ్ఞాన్‌ వర్సిటీ 10వ స్నాతకోత్సవం


గుంటూరు(విద్య), సెప్టెంబరు 22: యువ ఇంజనీర్లు పరిశోధనలతో నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో గురువారం జరిగిన 10వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రానున్న దశాబ్దకాలంలో వచ్చే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జ్ఞానాన్ని సరైన దిశలో అన్వయించి సమాజంలో సంపద సృష్టించేలా యువత ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నా రు. యువతలో ఉండే సరైన నాయత్వం, దార్శనికత ద్వారా నేడు సమస్యగా మారిన వ్యర్ధాలను సంపదగా సృష్టించే నైపుణ్యాలుఖ ఆవిష్కృతమౌతాయన్నారు. ఎంచుకున్న రం గం ఏదైనా అందులో సృజనాత్మకతతో ముం ుకు సాగాలని, అప్పుడే ఆ రంగంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టవచ్చని ఉద్ఘాటించారు. నేటి తరం యువత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారులుగా ఎదిగి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి రావాలని ఆయ న ఆకాంక్షించారు. ఇందుకు ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. స్టార్ట్‌పలు, వ్యాపారం, ఇండస్ట్రీ ఎకో సిస్టమ్‌ వంటి అంశాలకు భారత్‌ ఎంతో అనుకూలమని పేర్కొన్నారు. నేడు భారత్‌లో 100 కంటే ఎక్కువ యూనికార్న్‌ స్టార్ట్‌పలు ఉన్నాయని ఇవి ఒక్కొక్కటి వంద కోట్ల డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగి ఉన్నాయని గుర్తుచేశారు. 


నలుగురు ప్రముఖులకు డాక్టరేట్లు

స్నాతకోత్సవం సందర్భంగా హైదాబాదులోని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా, బాడ్మింటన్‌ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌, ఆస్త్రా మైక్రోవేవ్‌ ప్రొడక్ట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎంవీ రెడ్డి, ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణికి విజ్ఞాన్‌ వర్సిటీ గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసింది. ఇదిలా ఉంటే మొత్తం 1,842 మందికి డిగ్రీలు, 49 మందికి గోల్డ్‌మెడల్స్‌ అందజేశారు. కార్యక్రమంలో విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ పి.నాగభూషణ్‌, సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్నాతకోత్సవ కన్వీనర్‌ డి.విజయకృష్ణ పాల్గొన్నారు.  





Updated Date - 2022-09-23T09:13:10+05:30 IST