లాభసాటి పంటలపై దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2021-12-05T04:34:45+05:30 IST

రైతులు యాసంగిలో లాభ సాటి పంటలపై దృష్టి సా రించాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నారు.

లాభసాటి పంటలపై దృష్టి సారించాలి
కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా

పాన్‌గల్‌, డిసెంబరు 4 : రైతులు యాసంగిలో లాభ సాటి పంటలపై దృష్టి సా రించాలని  కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. మండలంలోని దవాజీపల్లి, అన్నారం గ్రామాల్లో ఏర్పా టు చేసిన కొనుగోలు కేం ద్రాలను శనివారం ఆమె పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడు తూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తేమశాతం పరి శీలించి కొనుగోలు చేయాలని సూచించారు. యాసం గిలో వరికి బదులుగా  ఆరుతడి పంటలు  సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. 

వైద్య సిబ్బందిపై ఆగ్రహం 

వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం పై  కలెక్టర్‌  ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో ని దవాజీపల్లి, అన్నారం గ్రామాల్లో కరోనా వ్యాక్సి నేషన్‌ మొదటి, డెండో డోసు వివరాలు అడిగారు. వైద్య సిబ్బంది పూర్తి వివరాలు తెలియజేయనందు కు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ రోజు వ్యాక్సినేషన్‌ పూర్తి వివరాలను సమగ్రంగా అందుబాటులో ఉం చుకోవాలని సూచించారు.ఒమైక్రాన్‌, కరోనా థర్డ్‌వేవ్‌ పై ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ మామిళ్లపల్లి విష్ణు వర్ధన్‌రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాసులు, జిల్లా పోగ్రామ్‌ ఆిఫీసర్‌ రవిశంకర్‌, డీసీవో విజయ భాస్కర్‌గౌడ్‌, ప్రాథమిక వైద్యాధికారి వంశీకృష్ణ, సీఈవో భాస్కర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-05T04:34:45+05:30 IST