అక్రమ కట్టడాలపై దృష్టి సారించండి

ABN , First Publish Date - 2020-11-25T05:09:45+05:30 IST

మునిసిపాలిటీ పరిధిలో అక్రమ కట్టడాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విశాఖపట్నం ప్రాంతీయ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ సహాయసంచాలకుడు కె.జయరాం ఆదేశించారు.

అక్రమ కట్టడాలపై దృష్టి సారించండి

ఇచ్ఛాపురం:మునిసిపాలిటీ పరిధిలో అక్రమ కట్టడాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విశాఖపట్నం ప్రాంతీయ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ సహాయసంచాలకుడు కె.జయరాం ఆదేశించారు. మంగళవారం మునిసిపాలిటీలో  అక్రమ లేఅవుట్లను జిల్లా టీసీపీ పి.నాయుడుతో కలిసి పరిశీలించారు. అనంతరం  మునిసిపల్‌ కమిషనర్‌ ఎల్‌.రామలక్ష్మి, పట్టణ ప్రణాళికవిభాగ అధికారి సీహెచ్‌ ఫణికుమార్‌తో సమీక్షించారు. అక్రమ లేఅవుట్లను గుర్తించి దరఖాస్తులు చేసుకొనేలా అవగాహన కల్పించాలని వార్డు సచివాలయాల పట్టణ ప్రణాళికా విభాగ సిబ్బందికి సూచించారు. పట్టణంలోని ఎనిమిది అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించాల్సి ఉండగా వాటిలో కొన్నింటిని పరిశీలించారు. 


Updated Date - 2020-11-25T05:09:45+05:30 IST